Wednesday, May 1, 2024

ఏప్రిల్ 11 నుండి వేణుగోపాలస్వామి వార్షిక వసంతోత్సవాలు

తిరుపతి : కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 11 నుండి 13వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 3.30 గంటల వరకు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పసుపు, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లను ఘనంగా ఊరేగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement