Sunday, December 8, 2024

పేదలకు ఊడిగం చేసేది మా పార్టీనే : ఎమ్మెల్యే భూమన

తిరుపతి సిటీ ఏప్రిల్ 6 (ప్రభ న్యూస్): పేదలకు ఊడిగం చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గురువారం ఓ ప్రైవేట్ కల్యాణ మండపం నందు జగనన్నే మా భవిష్యత్తు – మా నమ్మకం నువ్వే జగన్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో గృహ సారధులు, కన్వీనర్లు బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. ఐదున్నర కోట్ల మంది ప్రజలు దగ్గరకు రేపటి నుంచి 21 వరకు జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని వివరించారు. చంద్రబాబు జగన్ పై వ్యక్తిగత దూషణలు చేయడం తప్ప, తాను వస్తే ఏమి చేస్తాడు అనేది చెప్పడం లేదన్నారు

. సీఎం జగన్మోహన్ రెడ్డి 87 శాతం ప్రజలకు మూడున్నర లక్షల రూపాయలు సగటు నా అందించడం జరిగిందన్నారు. జగనన్న మా భవిష్యత్తు అనే కార్యక్రమం రేపటి నుంచి శ్రీకారం చుట్ట‌డం జరుగుతున్నది అన్నారు. ప్రజా ప్రతినిధులు సచివాలయం కన్వీనర్లు గృహ సారధులు, వాలంటీర్లు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లడం జరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసం ప్రతి ఇంటికి వెళ్లి వివరించడంతోపాటు ఇంటి యజమాని అనుమతితో స్టికర్లు అందించడం జరుగుతుందన్నారు. ప్రపంచంలో దేశ రాజకీయాల్లో ఎక్కడ కూడా ఒకేసారి ఏడు లక్షలు మంది వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబట్టి ఐదున్నర కోట్ల మంది ప్రజల్ని ప్రతి ఇంటికి వెళ్లి కలవడం జరుగుతుందని తెలియజేశారు. మూడున్నర లక్షల కోట్లు పేదలకు ఇచ్చిన ఘనుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకరే పేదల జీవితాలు మార్చాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం. మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన్ అభినయ రెడ్డి. ముద్ర నారాయణ, నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కేతo జయచంద్ర రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement