Thursday, May 2, 2024

లోన్ యాప్ లో డబ్బులు తీసుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దు…. ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి

తిరుపతి సిటీ : లోన్ యాప్ ల ద్వారా డబ్బులు తీసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ.పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయం నందు లోన్ యాప్ లపై డబ్బులు తీసుకుని లోన్ యాప్ ల ద్వారా వేధింపులకు గురవుతూ ఉంటే.. పోలీసులకు సమాచారం అందించాలని తెలియజేస్తూ విస్తృతంగా ప్రచారం చేసేందుకు పోస్టర్ విడుదలతో పాటు ఆటోలపై స్టిక్కర్లను అంటించి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఎవరైనా లోన్ యాప్ ద్వారా బాధింప పడుతూ ఉంటే ఆలస్యం చేయకుండా పోలీస్ ల‌కు సమాచారం అందించాలని కోరారు. ఆన్ లైన్ లో న్ యాప్ ద్వారా ఎప్పుడైతే ఫోన్ నుండి లాగిన్ అవుతారని, అప్పటినుండి వారి లోన్ యాప్ మోసగాళ్లు చేతిలో ఉన్నట్లే అన్నారు. నకిలీ లోన్ యాప్ లో లోన్ ఇచ్చేవారు కనబరిచిన వెబ్ సైటు, అడ్రస్సు, కాంటాక్ట్ డీటెయిల్స్, ఏ ఇతర వివరాలు అన్ని నిజమైనవి కావన్నారు. తీసుకున్న లోన్ అమౌంట్ మొత్తం వడ్డీతో సహా చెల్లించిన కూడా ఆగకుండా ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి మొబైల్ ఫోన్లో కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి పంపి మరలా మరలా డబ్బులు పంపాలని వేధిస్తూ ఉంటారన్నారు.. అదేవిధంగా ఒక నకిలీ లోన్ యాప్ లో లోన్ తీసుకున్న వారు ఇప్పుడు డబ్బులు లేదు ఇబ్బందిగా ఉంది అంటే నకిలీ లోన్ యాప్ వారే సర్వ తీసుకుని ఇంకో నకిలీ లోన్ యాప్ ద్వారా లోన్ మంజూరు చేయించి మొదటి లోన్ యాప్ కి పంపించుకుంటారని తెలియజేశారు.. ఈ నకిలీ లోన్ యాప్ ల వేధింపులు బారిన పడి చాలామంది ఒత్తిడికి లోనై పరువు ప్రతిష్ట కోసం ఆత్మహత్య చేసుకోకుండా సైబర్ క్రైమ్ పోలీస్ ని సంప్రదించాలని కోరారు.

ఎవరైనా లోన్ యాప్ ల‌ ద్వారా రుణం పొంది తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించిన పేమెంట్ కూడా రుణ యాప్ ప్రతినిధులు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడి వేధింపులకు పాల్పడుతుంటే తక్షణమే సమీప పోలీస్ స్టేషన్లో కానీ సైబర్ మిత్ర నెంబర్ కి కానీ డయల్ 100 కు సమాచారం అందించాలన్నారు.తిరుపతి జిల్లా పరిధిలో 11 నకిలీ లోన్ యాప్ లపై కేసు నమోదు చేయడంతో పాటు బాధితులు మొత్తం రూ.14.5 లక్షలు కోల్పోగా వాటికి సంబంధించిన అనుమానిత బ్యాంక్ అకౌంట్ లో సుమారు రూ.7.5 కోట్ల రూపాయల అమౌంట్. ఫ్రిజ్ చేసి బాధితుల‌కు కోర్టు బ్యాంకుల ద్వారా పోగొట్టుకున్న అమౌంట్ ను బాధితుల‌కు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుపతి నగరంలో లోన్ యాప్ లకు సంబంధించి 41 లోన్ యాప్ లింకులను ప్లే స్టోర్ నుండి తొలగించాలని కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదిక పంపించడం జరిగిందని పేర్కొన్నారు. వాటిని వెంటనే లోన్ యాప్ లింక్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించాలని కోరామని పేర్కొన్నారు.. ఇటీవల కాలంలో లోన్ యాప్ బాధ్యులతో పాటు ఇతర సైబర్ క్రైమ్ నేరాలు బాధితులు ఎక్కువవుతున్నారన్నారు. ప్రత్యేకించి లోన్ యాప్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడడం కూడా చూస్తూ ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదరపు ఎస్పి అడ్మిన్ సుప్రజ, క్రైమ్ ఆదనపు ఎస్పీ విమల కుమారి, ట్రాఫిక్ డిఎస్పి వన్ కాటమరాజు, వెస్ట్ డిఎస్పి నర్సప్ప, ఎస్సీ ఎస్టీ సెల్.. నాగ సుబ్బన్న, సైబర్ క్రైమ్ సిఐ విక్రమ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement