Friday, April 26, 2024

ఇంత దారుణమా ..చిన్నారులతో టాయిలెట్స్ క్లీనింగ్ -మధ్యప్రదేశ్‌లో సిగ్గుమాలిన ఘటన

చేతిలో పుస్తకాలు ఉండాల్సిన విద్యార్థినులు చీపుర్లు చేత పట్టి మరుగుదొడ్లు శుభ్రం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి కోసం దూరంలో ఉన్న హ్యాండ్‌ పంప్‌ ను వినియోగిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. బాలికలు టాయిలెట్లు క్లీనింగ్‌ చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో వెలుగు చూసింది.చక్‌దేవ్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలికలతో టాయిలెట్లను శుభ్రం చేయించారు. బాలికలు చీపురు పట్టి టాయిలెట్‌ను శుభ్రం చేస్తూ, కడుక్కుంటున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా రఘువంశీ మాట్లాడానికి నిరాకరించారు.అదే సమయంలో ఈ ఘటనపై గుణ కలెక్టర్ ఫ్రాంక్ నోబుల్ మాట్లాడుతూ.. ఈ విషయం దృష్టికి వచ్చిందని, దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, విద్యార్థినుల పట్ల ఇలాంటి ప్రవర్తన అస్సలు సహించేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర పంచాయతీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా ఈ సంఘటనపై స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు విద్యా శాఖ ఈ ఘటనపై చాలా సీరియస్ అయ్యింది. అధికారుల బృందం ఆ పాఠశాలలో పర్యటించింది .ఈ సంఘటనపై నేరుగా దర్యాప్తు చేస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement