Friday, May 17, 2024

యువతను మోసం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. పీఎస్ లో ఫిర్యాదు

తిరుపతి సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాబు ఎక్కడ జగన్ యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు తెలియజేశారు. బుధవారం రిక్షా తొక్కుతూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. వెస్ట్ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తలరాతలు మారుతాయని, మీకు మేనమామగా మారుతానని మోసపూరితమైన మాటలు చెప్పడం జరిగిందని తెలియజేశారు. రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని తెలియజేయడం జరిగిందని వివరించారు. అలాగే మెగా డీఎస్సీని ఏర్పాటు చేస్తానని.. అలాగే పోలీస్ శాఖలో ఉన్న ప్రతి పోస్ట్ ను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి యువకుడు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడనే ఉద్దేశంతో నమ్మి ఓట్లు వేయడం జరిగిందని.. ఆయనేమో ముఖ్యమంత్రి అయి మూడు సంవత్సరాలు అయిందని, ప్రతి జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీ హామీలన్నీ.. అప్పులు పాలై కోచింగ్ సెంటర్ లో విద్యనభ్యసించడం జరిగిందని.. వయసు మితిమీరిపోతున్నా.. నోటిఫికేషన్ విడుదలలో నిర్లక్ష్యం వ‌హిస్తున్నారని తెలియజేశారు. పొట్టకూటి కోసం తల్లిదండ్రులను కాపాడే దానికోసం రిక్షాలు ఆటోలు తొక్కుంటూ జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. వలస కార్మికుల్లాగా ఆంధ్రప్రదేశ్ లో యువత జీవితం తయారైందన్నారు. నిరుద్యోగ యువకులు 69 మంది చనిపోవడం జరిగిందని సీఎం జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఐ చలపతికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధులు పెరుమాళ్ మధు. శేషాద్రి నాయుడు, రాష్ట్ర కార్యదర్శులు ఆర్పీ శ్రీనివాసు, కె.వి.కె ప్రసాద్, తెలుగు యువత తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సుదీర్, సందీప్, మీడియా కోఆర్డినేటర్ శ్రీరామ్, పార్లమెంటు అధికార ప్రతినిధి హరి ప్రసాద్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement