Thursday, April 25, 2024

చిత్తూరు డీఆర్డీఏ కు జాతీయ పురస్కారం.. 

చిత్తూరు, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : చిత్తూరు జిల్లా గ్రామీణ సంస్థ నిర్వహిస్తున్నవివిధ పథకాలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మమైన రెండు స్కాచ్ సిల్వర్ అవార్డులు దక్కాయి. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డులను డీఆర్డీఏ పీడీ తులసి డీసీఎం వెంకటేషులకు స్కాచ్ ప్రతినిధులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆరు అవార్డులు అందగా.. అందులో చిత్తూరు జిల్లాకే రెండు అవార్డు దక్కడం విశేషం. దేశ వ్యాప్తంగా గ్రామీణ అభివృద్ధి మహిళా ఆర్థిక స్వాలంబన తదితర కార్యక్రమాలకు సంబంధించి ఈ అవార్డులకు సుమారు 100కు పైగా ప్రాజెక్టు పోటీపడ్డాయి.

జిల్లాలో పొదుపు సంఘాలను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న పలు పథకాలను గ్రామీణ ప్రాంత మహిళలు తెలియజేస్తూ వారిలో ఆర్థిక సామాజిక రంగాల పట్ల చైతన్యాన్ని నింపుతూ, జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలచే నిర్వహించబడుతున్న మహిళా నవోదయం మాసపత్రికకు ఈ అరుదైన పురస్కారం తగ్గింది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉపాధి కల్పనా మిషన్ ద్వారా గ్రామీణ యుద్ధ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు పునాది వేస్తున్న ఈజీ ఎంఎం (ఉపాధి కల్పన మిషన్) కూడా ఢిల్లీకి చెందిన స్కాచ్ సంస్థ మరో సిల్వర్ అవార్డును అందజేసింది. చిత్తూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు ఏకకాలంలో రెండు అవార్డులు రావడం గర్వించదగ్గ విషయమని డీఆర్డీఏ పీడీ తులసి తెలిపారు. జిల్లా కలెక్టర్ హరి నారాయణ సహాయ సహకారాలు డీఆర్డీఏ సిబ్బంది సమిష్టి కృషి వల్లనే సాధ్యమైందని ఆమె వివరించారు. దీంతో మరింత బాధ్యత పెరిగిందని జిల్లాకే రెండు అవార్డులు దక్కడం విశేషమని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement