Tuesday, April 30, 2024

‘అఖండ’ సినిమాపై చంద్రబాబు ఏమన్నారంటే..

నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2న విడుదలైన ఈ మూవీ స్టాంగ్ కలెక్షన్ తో రన్ అవుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వీక్షించారు.  తాను ‘అఖండ’ చిత్రాన్ని చూశానని తెలిపారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ‘అఖండ’ సినిమాలో చూపించారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. సినిమా చాలా బాగుందన్న చంద్రబాబు.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇదని పేర్కొన్నారు.

కాగా, బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా హ్యాట్రిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. తాజాగా అఖండ కూడా వాటి సరసన నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement