Sunday, April 28, 2024

AP : ఇవాళ కోన‌సీమ‌లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న..

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇవాళ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌టించ‌నున్నారు. రావులపాలెం, రామచంద్రాపురంలో ప్రజాగళం బహిరంగ సభలో ఆయ‌న పాల్గొనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకి చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఈతకోట హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు చేరుకోనున్నారు.

- Advertisement -

అనంత‌రం రావులపాలెం టీడీపీ ఆఫీస్ సెంటర్‌లో బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన రామచంద్రాపురం చేరుకొని బహిరంగ సభ నిర్వహించనున్నారు. వీఎస్ఎమ్ కళాశాలలో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement