Sunday, April 28, 2024

TS : హైద‌రాబాద్‌లో రెండుప్రాంతాల్లో అగ్ని ప్ర‌మాదం…

హైద‌రాబాద్‌లో ఈ తెల్ల‌వారుజామున రెండు ప్రాంతాల్లో అగ్ని ప్ర‌మాదాలు సంభ‌వించాయి. మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

- Advertisement -

సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తోంది. మంటలు అంటుకున్న వెంటనే ఆయిల్ గోదాం నుంచి పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ఇవాళ మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాయిబాబా నగర్‌లోని విమల్ ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు నల్లటి పొగ పరిసర ప్రాంతమంతా దట్టంగా వ్యాపించింది. హుటాహుటిన ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల మాదిరిగా పరిశ్రమలు వెలిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement