Saturday, May 18, 2024

175 సాధించి వైసిపి ని బంగాళాఖాతంలో కలిపేస్తాం – చంద్రబాబు

( ప్రభ న్యూస్ బ్యూరో – కృష్ణా)సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రూ. 2 లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డాడని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు రూ.6 లక్షల కోట్లకు అవినీతికి పాల్పడ్డానని ఆరోపణ చేసిన జగన్ ఏం పీకాడంటూ ఎద్దేవా చేశారు. కొంతమందికి డబ్బులు ఇచ్చి.. బెదిరించి తనపై సాక్షాలు చెప్పాల్సిందిగా వైకాపా చేస్తున్న పన్నాగాలు ఫలించవని పేర్కొన్నారు. బుధవారం ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు కృష్ణాజిల్లా పర్యటనకు వచ్చారు. మచిలీపట్నం హిందు కళాశాల గ్రౌండ్స్ లో అర్ధరాత్రి జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచారని, ఇతనా పేదల కోసం పోరాడేది అని ప్రశ్నించారు. తాము నీతివంతంగా బతికామని, అటువంటి తనపై బురద అవినీతి బురద చల్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు

. ఈ ప్రాంత అభివృద్ధి చేయడానికి మచిలీపట్నం పోర్టుకు పనులు ప్రారంభం చేస్తే, వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు నిలిపివేసి కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసిందన్నారు. కమిషన్ల కోసం బందరు పోర్టును ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మీ అందరి సహకారంతో 175 కి 175 సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని పిలుపునిచ్చారు. సమాజానికి క్యాన్సర్‌ లాంటివాడు జగన్‌ అని విమర్శించారు.

‘‘జగన్‌ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్‌ గడ్డ. ప్రజలను పట్టి పీడిస్తున్నాడు’’ అని నిప్పులుచెరిగారు. ‘చివరి సంవత్సరం.. ఇంకొన్ని నెలలే.. సైకో పోవడం ఖాయం. రాష్ట్రం నుంచి సైకో పోకపోతే.. మనమే రాష్ట్రం వదిలి పోయే పరిస్థితి నెలకొంది’’ అని చంద్రబాబు అన్నారు. ‘‘ఇల్లు మీది.. స్టిక్కర్ సైకోది. మధ్యలో సైకో పెత్తనం ఏంటి? ఇంటి యజమాని అనుమతి లేకుండా ఇంటికి స్టిక్కర్లు అతికించడం అనైతికం. చట్ట వ్యతిరేకం’’ అని చెప్పారు.వాలంటీర్లకు ఇచ్చేది ప్రజాధనం కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ తాత ముత్తాతల సొమ్ము తెచ్చి ఇస్తున్నారా? అని నిలదీశారు. ‘‘నంగి నంగిగా మాట్లాడతాడు. జగనే భవిష్యత్ అంట.. జగనే మా నమ్మకం అంట. జగనే నమ్మకం కాదు.. జగనే మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం. జగన్ పోతేనే పిల్లల భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తు. జగన్ ఉంటే రాష్ట్రం అంధకారమే అని అన్నారు. బాబాయ్ గురించి ఏం చెప్పాలి. బాబాయ్ ని అనునిత్యం చంపేస్తున్నారు. మొదటి రోజు గుండెపోటు.. తర్వాత రక్తపోటు. ఆ తర్వాత.. గొడ్డలితో చంపి నా పేరు పెట్టాలనుకుంటున్నారంటే ఏం దొంగలు. వాళ్లు కరుడుగట్టిన నేరస్థులు, ఆర్తిక ఉగ్రవాదులు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నిత్యవసర ధరలు పెరిగాయి. కరెంటు చార్జీలు పెంచారు. ఇచ్చేది పది.. గుంజేది వంద. బయటి రాష్ట్రాల ప్రజలు ఏపీ పరిస్థితి చూసి జాలి పడుతున్నారు’’ అని చంద్రబాబు విమర్శించారు. .జగన్‌ వంటి వారు సమాజానికి ప్రమాదమన్నారు. వైసీపీ రౌడీలు మెడపై తుపాకీ పెట్టి ఆస్తులు రాయించుకుంటారన్నారు. మహిళల శీలానికి, యువతకు ఉద్యోగ భద్రత, విద్యార్థులకు విద్య భద్రత లేదని చంద్రబాబు విమర్శించారు. బయట రాష్ట్రాల నాయకులు మనల్ని చూసి జాలి పడుతున్నారని తెలిపారు. ‘‘నిన్ను నాశనం చేసే పార్టీని నువ్వు మొస్తావా… సమాజాన్ని నాశనం చేసే పార్టీని మోస్తావా. టీడీపీ హయాంలో ఈ పోలీసులే బాగా పనిచేశారని తెలిపారు. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 3 స్థానాలు గెలిచామని… తాను అనుకున్న చైతన్యం ఇప్పుడు వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మన:సాక్షితో ఓటు వేయాలని కోరామని తెలిపారు.

23 ఓట్లు.. 23వ తేదీన.. 23 సంవత్సరం గెలిపించారని.. ఇది కాదా దేవుడి స్ర్కిప్ట్ అంటే.. అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లా మంత్రి , మచిలీపట్నం శాసనసభ్యుల అక్రమాలు పై ఆరోపణలు స్పందించారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా అధ్యక్షుడు నారాయణరావు, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు,, మండల బుద్ధ ప్రసాద్, బోడె ప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్, కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల రామయ్య, వర్ల కుమార్ రాజా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement