Sunday, April 28, 2024

Central Team – శ్రీశైలం డ్యామ్‌ని సందర్శించిన సేఫ్టీ కమిటీ.

కర్నూల్ బ్యూరో శ్రీశైల జలాశయం ను జాతీయ జలాశయాల సేఫ్టీ కమిటీఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబి సభ్యుల బృందం.. గురువారం సందర్శించారు. జలాశయ సందర్శనలో భాగంగా రెండు రోజుల పాటు ఈ బృందం శ్రీశైలంలో పర్యటనించనుంది. ఈ సేఫ్టీ కమిటీలో ఎన్డిఎస్ఏ చైర్మన్ వివేక్ త్రిపాఠి, సాంకేతిక సభ్యుడు రాకేష్ కశ్యప్, కెఆర్ఎంబి సంబంధించిన దాదాపు10 మంది బృంద సభ్యులు ఉన్నారు.,

ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చిన సభ్యుల బృందానికి శ్రీశైల జలాశయ ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి, పలువురు డ్యామ్ ఇంజనీర్లు వారి వెంట ఉన్నారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయంను కృష్ణ బోర్డు (కెఆర్ఎంబి) పరిధిలోకి తేనున్న క్రమంలో డ్యాం భద్రత, నిధులు, ఖర్చు, పనుల నిర్వహణ,నీటి నిల్వలు, తదితర అంశాలపై పూర్తిస్థాయిలో జలవనరుల నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుంది.

జలాశయం భద్రత, నీటి నిల్వలు, నీటి వినియోగంపై సమగ్రంగా పరిశీలించి జలాశయం వివరాలను డ్యామ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలానే 2009 లో జలాశయం వరదలపై అధికారులతో తెలుసుకొని డయగ్రామ్స్, వీడియోలు, మ్యాపులను పరిశీలించారు. అలానే జలాశయం డ్యామ్ గేట్లు, గ్యాలరీ, రోప్స్, డ్యామ్ ముందు ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ (పెద్ద గొయ్యి ) గురించి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్లాంజ్ ఫుల్ ఏర్పడినట్లు భావిస్తున్న గడ్డర్లను పరిశీలించారు.అలానే డ్యామ్ ముందుగల గేట్లను పరిశీలించి అధికారులతో చర్చించారు.

డ్యామ్ భద్రత ఎలా పని చేస్తుందని అరా తీశారు. పరిశీలన అనంతరం డ్యామ్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నారు.

పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రాజెక్టు సిఈ కబీర్ బాషా నేషనల్ జలశక్తి సూచనల మేరకు డ్యాం నేషనల్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ పరిశీలనకు వచ్చారని వివేక్, విటల్ ఆధ్వర్యంలో డ్యామును పరిశీలించారని డ్యామ్ స్థితి గతి ఎలా ఉంది. ఏమైనా ఇబ్బందులను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. ప్లాంజ్ ఫుల్ పరిస్థితి ఎలా ఉంది దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై పరిశీలన చేశారన్నారు. ప్లాంజ్ ఫుల్ మరీ లోతుగా గోయి పడకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అంతేకాదు మూడు గ్యాలరీలు పరిశీలించి వాటి సీపీసీ ఎలా వస్తుంది , ఎలా అందజేస్తున్నారని డ్యామ్ గేట్లు ఎలా ఆపరేటింగ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు.మళ్ళీ మధ్యాహ్నం నుండి వీటన్నిటికీ సంబంధించి చర్చ చేసి నిపుణులు బృందం సలహాలు సూచనలు చేశారు.

- Advertisement -

వీటితోపాటు అప్రోచ్ రోడ్డు సిలికాన్ సిలిండర్ గురించి గతంలోనే ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదన సమర్పించడం జరిగిందన్నారు. వీటిపై కూడా చర్చ చేశారని అలానే ఇప్పటికే ప్రపంచ బ్యాంకు కి సుమారు డ్యామ్ మరమ్మతులకు 135 కోట్లు అంచనా వ్యయం వేసి పంపించామన్నారు.మరొకసారి ఎన్డిఎస్ఏ బృందం సలహాలతో ఇంకా ఏమైనా కావాల్సినా వాటి గురించి కూడా ప్రతిపాదన చేస్తామని తెలిపారు. ప్రస్తుతానికి డ్యాం స్థితిగతికి ఎటువంటి ఇబ్బంది లేదని ప్లాంజ్ ఫుల్ అలానే చిన్నచిన్న రిపేర్లకుపై నిపుణుల బృందం సభ్యులు కొన్ని సలహాలు, సూచనలు చేశారని శ్రీశైలం ప్రాజెక్టు సిఈ కబీర్ భాషా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement