Saturday, May 4, 2024

Caste Census: నేటి నుంచి కులగణన.. ఏపీలో ఇంటింటి సర్వే..

ఏపీలో నేటి నుంచి కుల‌గ‌ణ‌న చేప‌ట్ట‌నున్నారు. ప్రతీ సచివాలయం పరిధిలోని ఇళ్లకు వాలంటీర్లు వెళ్లి.. ప్రతీ ఒక్కరి వివరాలను సేకరించనున్నారు. ఈ రోజు ప్రారంభం కానున్న ఈ కులగణన ప్రక్రియ 10 రోజుల పాటు కొనసాగనుంది. అయితే, ఈ సమయంలో ఎవరైనా వివరాలు నమోదు చేయకపోతే.. ఆ తర్వాత కూడా అవకాశం కల్పించనున్నారు.

అయితే, ఆన్‌లైన్‌లో వివరాలు సేకరించాల్సి ఉండగా.. మారుమూల పల్లెల్లో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు.ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో సర్వేవివరాలు నమోదు చేస్తారు.. తలెత్తే సమస్యల సత్వర పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల వద్ద సహాయ కేంద్రాల ఏర్పాటు చేస్తారు. అయితే, మారుమూల పల్లెల్లో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇక, సిద్ధం చేసిన ప్రత్యేక మొబైల్‌ యాప్‌లో దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారీగా వర్గీకరించి అనుసంధానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement