Monday, April 29, 2024

Andhra Pradeshలో కరోనా కలకలం… వేగంగా పెరుగుతున్న కేసులు

విజయవాడ – శీతాకాలం కావడంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గాలీలో మంచు చేరడంతో కరోనా వైరస్ తిరిగి ప్రాణం పోసుకుంటున్నది.. దీంతో రోజు రోెజుకి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి.. నిన్నటి వరకూ దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కి చేరుకుంది. గత 24 గంటల్లో ఏకంగా 328 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో సైతం 3 కొత్త కేసులు వెలుగు చూశాయి. అయితే ఈ కేసులు పాత వేరియంట్ వా? లేక కొత్త వేరియంట్ వా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.

మరోవైపు కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కరోనాపై సమీక్షను నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి సంబంధించి ఆయన కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. టెస్టింగ్ లను పెంచడం, ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. కాగా బహిరంగ ప్రదేశాలలో మాస్క్ లు ధరించాలని ప్రజలను ప్రభుత్వం కోరింది.. కరోనా లక్షణాలకు కనిపిస్తే వెంటనే టెస్ట్ లు చేసుకోవాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement