Saturday, May 4, 2024

గుణాత్మక నైపుణ్యాల అభివృద్ధికి క్యాట్స్‌ సహకారం..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌లో గుణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కెరీర్‌ అకాడమీ అండ్ టెక్నికల్‌ స్కిల్‌ (క్యాట్స్‌) సహకారం తీసుకోనున్నట్లు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన రెడ్డి వెల్లడించారు. యుఎస్‌ఏలోని నార్త్‌ కరోలినాలో ”కెరీర్‌ అకాడమీ అండ్‌ టెక్నికల్‌ స్కిల్‌ (క్యాట్స్‌) డెవలప్‌మెంట్‌ సెంటర్‌”ను ఇటీవలే సందర్శించినట్లు పేర్కొన్నారు. కార్మికుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, స్థానిక ఆర్థిక వ్యవస్థలో నాయకులుగా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పడానికి ఈసెంటర్‌ దోహదపడుతోందన్నారు.

ఆటోమోటివ్ టెక్‌, వడ్రంగి, వెల్డింగ్‌, తాపీపని, అత్యవసర వైద్య చికిత్స, అగ్నిమాపక అకాడమీ, నర్సింగ్‌, క్యూలినరీ ఆర్ట్స్‌, ఫిల్మ్‌ మేకింగ్‌, యానిమేషన్‌లో శిక్షణ ఇస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణా కేంద్రాల్లో యువతకు ఇస్తున్న శిక్షణ, ప్లేస్‌మెంట్లపై క్యాట్స్‌ ప్రతినిధులకు వివరించినట్లు తెలిపారు. ఏపీలో గుణాత్మక నైపుణ్యాలను మెరుగుపర్చడానికి సంబంధించి క్యాట్స్‌ ప్రిన్సిపాల్‌ లారీ ఇ రోజర్స్‌, ప్రోగ్రామ్‌ క్యాంప్‌ డైరెక్టర్‌ డెబ్రా లెస్టర్‌ తో చర్చించినట్లు మధుసూదన రెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement