Tuesday, May 7, 2024

మానసిక ఆందోళనతోనే ఫీల్డ్ ఆఫీసర్ ఆత్మహత్య

ప్రకాశం జిల్లా టంగుటూరు కెనరా బ్యాంకు పీల్డ్ ఆఫీసర్ ఐశ్వర్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఐశ్వర్య వ్యక్తిగత కారణాలు, మానసిక క్షోభతోనే ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కధనం ప్రకారం.. మహరాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన ఐశ్వర్య నరనాద్ రాందేవి(24) 6 నెలల క్రితం టంగుటూరు కెనరా బ్యాంకులో పీల్డ్ ఆఫీసర్ గా చేరారు. ఆమె చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోయారు. మానసిక క్షోభ, ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతిరాలు లేటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. బ్యాంకులో ఎటువంటి ఒత్తిడి లేదని సూసైడ్ లేటర్ లో పేర్కొంది. ఉద్యోగం చేయడం కూడా ఇష్టం లేదని తెలిపింది. బుధవారం రాత్రి పదిగంటలు సమయంలో ఆత్మహత్య చేసుకుంది అని ఎస్ఐ తెలిపారు. కెనరా బ్యాంకు మేనేజర్ కాకర్ల కృష్ణ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శవపంచనామ నిమిత్తం మృతదేహాని ఒంగోలు రిమ్స్ కు తరిలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement