Saturday, April 27, 2024

Bullion Market – బంగారం ధర పై పైకి… నిలకడగా సిల్వర్

15 రోజుల క్రితం వరకు బంగారం ధరలు కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించాయి. కానీ గత వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగతు కొనుగోలుదారులకు ధరలు షాకిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగల సీజన్ కావడంతోపాటు, పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. కానీ ధర పెరిగినా కొనక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో వారం క్రితం వరకు భారీగా తగ్గిన గోల్డ్ ధర.. వారం రోజులుగా భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిస్తోంది. దీంట్లో భాగంగా శుక్రవారం కూడా బంగారం ధర మరింతగా పెరిగింది. శుక్రవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. గోల్డ్ ధరలు కాస్తంత పెరిగాయి. మరోవైపు వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర నిలకడగా ఉంది

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల్లో శుక్రవారం కాస్తంత పెరిగింది. దీంతో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 54,010 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 58,920గ వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..-

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,160 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 59,070గా ఉంది.- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,160 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,080గా ఉంది.-

ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 54,010, కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,920 వద్ద కొనసాగుతుంది.

- Advertisement -

నిలకడగా ఉన్న వెండి ధర ..

దేశ వ్యాప్తంగా వెండి ధర గురువారం ధరలోనే నిలకడగా ఉంది.. కిలో వెండిపై గురువారం రూ. 500 తగ్గింది…అదే ధర నేడు కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 75,000 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,000 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి రూ.72,100 వద్దకు చేరింది

Advertisement

తాజా వార్తలు

Advertisement