Tuesday, April 30, 2024

AP: చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో అభిషేకం చేసిన బుద్దా వెంకన్న..

ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్ః చంద్రబాబు కుటుంబం మీద వీరాభిమానాన్ని చూపించే బుద్దా వెంకన్న చంద్రబాబు ఫ్లెక్సీని తన రక్తంతో అభిషేకం చేశారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలోని తన కార్యాలయం వద్ద మొదట రక్త దానం చేసిన ఆయన అనంతరం తన రక్తంతో గోడమీద జై సిబిఎన్ఏ నా ప్రాణం సిబిఎన్ అంటూ రాశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాట్లాడారు.

కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు కి తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. నా దారిద్ర్యం కి కేశినేని నాని వచ్చాడన్నారు.
నన్ను పశ్చిమ నియోజకవర్గ నుంచి తీసేయాలని వేరే వాళ్ళని పెట్టాలని కోరాడనీ గుర్తు చేశారు. అప్పట్లో చంద్రబాబు నన్ను విజయవాడ నగర అధ్యక్షుడు గా పెట్టారు..6 ఏళ్ళు చేసానన్నారు. మూడు జిల్లాలకు ఇంచార్జి గా చంద్రబాబు నన్ను నియమించారన్నారు. చంద్రబాబు పై దాడి జరిగితే ఎవడు మాట్లాడలేదు.. నేను పోరాటం చేసానన్నారు. జోగి రమేష్ పై గొడవకు వెళ్ళినపుడు సొమ్ము సిల్లి పడిపోయానన్నారు.పశ్చిమ నియోజకవర్గం తప్ప అన్ని స్థానాల్లో ఐ వి ఆర్ నిర్వహస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు కి, లోకేష్ కి చెప్పాను నేను ఎమ్మేల్యే గా పోటీ చేస్తా అని అన్నారు. చంద్రబాబు వెనుక అసెంబ్లీ లో కూర్చోవాలని కోరుతు‌న్నా అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి. లాయల్టీ గా ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చంద్రబాబు కుటుంబం తప్ప వేరే ఎవరు నాకు నాయకులు కాదన్నారు.

- Advertisement -


రాష్ట్రములో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు. పార్టీ కోసం నిలబడే వాళ్లకు అవకాశం ఇవ్వాలన్నారు.
విజయవాడ వెస్ట్..లేదా అనకాపల్లి పార్లమెంట్ అడుగుతున్నాను..నన్ను పోటీ చేపించండనీ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. నా ప్రాణం చంద్రబాబు… నా రక్తంతో కాళ్ళు కడిగి ప్రేమ చూపించా అన్నారు. కొడాలి నాని, వంశీ, కేశినేని నాని టైప్ కాదు నేను అని చెప్పారు. నా రక్తం మొత్తం చంద్రబాబే అన్నారు. నా గుండె కోసి మీ టేబుల్ మీద పెట్టగలనన్నారు. ఎవారి మీదకైనా దుకేశక్తి, సైన్యం నాకు ఉందన్నారు. ముగోళ్లు , చెవిటోళ్లు వున్నారు.. చంద్రబాబు పై వైసీపీ విమర్శలు చేస్తే ఒక్కడు మాట్లాడరన్నారు. చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా సిపిఎం జిందాబాద్ అనే అంటాను అన్నారు. ఇది అభిమానమే.. బ్లాక్ మెయిలింగ్ కాదనీ గుర్తు చేశారు. ఇక‌ నా‌ పని తీరు , స్వామి భక్తి ఎలా నిరూపించుకోవాలన్నారు.నాకు సీటు ఇచ్చి చట్ట సభల్లో అడుగు పెట్టించాలని కోరుతున్నా అని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇది నా విన్నపం, విజ్ఞప్తి మాత్రమే అన్నారు. నాలో ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు కుటుంబం తోనే నా ప్రయాణం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement