Saturday, May 4, 2024

Breaking: అప్పుడెందుకు చెప్పలేదు.. ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

అమరావతి కేసుల విచారణను ఏపీ హైకోర్టు ప్రారంభించింది. ప‌రిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన 90కి పైగా పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈరోజు (సోమ‌వారం) విచారణ ప్రారంభించింది. ఈ కేసుల విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం ఆగిపోయినట్టు కనిపిస్తోందని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. రాజధాని కేసుల విచారణకు అత్యంత ప్రాధాన్యం ఉందని చెప్పింది.

అయితే.. త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ సోమయాజులు, జస్టిస్ సత్యనారాయణ మూర్తిలను తప్పించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. వారిద్దరికీ రాజధానిలో భూములున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారాయ‌న‌. గతంలో ఈ పిటిషన్ల విచారణ జరిగినప్పుడు ఈ విషయంపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని హైకోర్టు ప్ర‌శ్నించింది. న్యాయ‌మూర్తుల‌ను త‌ప్పించాల‌న్న ప్ర‌భుత్వ‌ విన్నపాన్ని ఏపీ హైకోర్టు తిరస్కరించింది.

తాము అభ్యంతరం వ్యక్తం చేశామనే విషయాన్ని రేపు తీర్పులో ప్రస్తావించాలని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అమరావతి రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement