Tuesday, May 21, 2024

Breaking : వైఎస్సార్ జిల్లాలో జ‌గ‌న్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌.. కమలాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

క‌మ‌లాపురం బ‌హిరంగ‌స‌భ‌లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టించారు. కాగా క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు ప్రారంభోత్స‌వాలు చేయ‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. కమలాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం.. దేవుడు ఆశీస్సులతో అందరికీ మంచి చేస్తున్నా.. వైఎస్సార్‌ జిల్లాకు కృష్ణా నీటిని తీసుకురావడానికి మహానేత వైఎస్సారే కారణం.. గాలేరు-నగరిని తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌ ఎంతో కృషి చేశారు.. మహానేత వైఎస్సార్‌ కృషితోనే గండికోట ప్రాజెక్టును పూర్తి చేశాం.. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయి..

గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లాలో మూడు రోజులపాటు (డిసెంబర్‌ 23, 24, 25) పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం సీఎం జగన్‌ వైఎస్సార్‌ కడప జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయి .. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేద‌న్నారు జ‌గ‌న్. రూ. 550 కోట్లతో బ్రహ్మంసాగర్‌ లైనింగ్‌ పనులు చేపట్టాం..మేం వచ్చాకే చిత్రావతి ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశాం.. కొప్పర్తిలో ఇండస్ట్రీయల్‌ పనులకు శంకుస్థాపన చేశాం.. ఇండస్ట్రీయల్‌ పార్క్‌ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement