Saturday, April 27, 2024

AP: బీజేపీ, జనసేన, టీడీపీ క‌ల‌యిక విశ్వాస ఘాతుక‌మే.. కొత్త పొత్తుపై సీపీఎం హాట్ కామెంట్స్..

విజ‌య‌వాడ – టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి.. బీజేపీ అంటే భగ్గుమనే కమ్యూనిస్టు పార్టీలు.. ఇప్పుడు బీజేపీతో టీడీపీ చేతులు కలపడాన్ని తప్పుపడుతోంది..విజ‌య‌వాడ‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, .. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు విశ్వాస ఘాతుక పొత్తుగా పేర్కొన్నారు.. ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు ప్రజలకు వెన్నుపోటుగా అభివర్ణించిన ఆయన.. జాతీయ స్ధాయిలో పొత్తులు పొడుస్తున్నాయంటే సంకీర్ణ పరిస్థితులు వస్తున్నాయని అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ గెలుస్తామన్న నమ్మకం కోల్పోయింద‌ని .. అందుకే పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తుందని దుయ్యబట్టారు.

ఇక, కాంగ్రెస్ పార్టీతో మాది రాజకీయ పొత్తు కాద‌ని కేవలం.. సీట్ల సర్దుబాటు మాత్రమే అని స్పష్టం చేశారు వి. శ్రీనివాసరావు.. తెలంగాణలో సీట్ల దగ్గర కాంగ్రెస్ పార్టీతో విబేధాలు వచ్చాయని గుర్తుచేశారు. మరోవైపు ఎన్డీఏలో చేరిన టీడీపీ లౌకిక పార్టీనా? కాదా? అనే విషయాన్ని ఆ పార్టీ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.. 2019 తర్వాత బీజేపీపై ప్రజల ఆగ్రహం పెరిగిందన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తును ప్రజలు తిరస్కరిస్తార‌ని తేల్చి చెప్పారు…. ఆ పార్టీలు ఎన్నిక‌ల తర్వాత అడ్రస్ లు వెతుక్కోవాల్సిందేనని జోస్యం చెప్పారు శ్రీనివాసరావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement