Saturday, December 7, 2024

BIG STORY : గ్రీన్‌ ఏపీ! ఇంధన సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి..

దేశంలో ఇంధన సామర్ధ్య మరియు ఇంధన సంరక్షణ కార్యక్రమాలు అమలు చేసేందుకు ఏపీ, కేరళ తరహా నమూనాలను అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) లక్ష్యాలను నిర్ధేశించుకుంది. ఇందుకోసం రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించేందుకు అనువైన ఎజెన్సీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. వీటిద్వారా వినియోగదారులకు చౌకైన, నాణ్యమైన, నమ్మకమైన నిరంతరాయ విద్యుత్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలకు నిరంతరాయంగా 24/7 నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు గానూ ఇంధన పొదుపు, సామర్ధ్య కార్యక్రమాలు ఇతోధికంగా దోహదపడతాయని బీఈఈ భావిస్తోంది. ఇప్పటికే ఏపీ ఇంధన సామర్ధ్య కార్యక్రమాలకు కీలక రాష్ట్రంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడే మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఏపీని దేశ వ్యాప్తంగా ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా, స్థిరంగా నిలిపేలా రాష్ట్రానికి సాంకేతిక, ఆర్ధిక సహాయం అందిం చేందుకు బీఈఈ సన్నద్ధత తెలిపింది. దేశంలోని అన్ని రంగాల్లో 129 మిలియన్‌ టన్నుల చమురు సమానమైన ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది. ఎనర్జీ కన్జర్వేషన్‌ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ చర్యల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడంలో ఏపీ ప్రోయాక్టివ్‌ రాష్ట్రంగా దేశంలోనే గుర్తింపు పొందింది. అలాగే 65 ఎంఎస్‌ఎంఈల్లో ఐఓటీ టెక్నాలజీ అమలు ద్వారా మోడల్‌ రాష్ట్రంగా కూడా గుర్తింపు పొందింది.

ఈ క్రమంలోనే ఏపీలో ఇంధన సామర్ధ్య రంగాన్ని మరింతగా ముందుకు తీసుకొచ్చేందుకు బీఈఈ సహకరించేందుకు ముందుకొస్తోంది. ఏపీ సహా అన్ని రాష్ట్రాలకు ఏజెన్సీలు ఏపీ సహా అన్ని రాష్ట్రాలకు చెందిన డిజిగ్నేటెడ్‌ ఏజెన్సీ (ఎన్డీఏ)లతో ఆదివారం బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ భాక్రే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈక్రమంలోనే దేశంలోని ప్రతి పౌరుడు ఇంధన సామర్ధ్య చర్యలను తూ.చ.తప్పకుండా ఆచరించేలా వారిని భాగస్వామ్యం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్చి వక్కానించారు. అప్పుడే ఇంధన సామర్ధ్య రంగంలో జాతీయ లక్ష్యాలను సాధించేందుకు అవకాశముంటుందన్నారు. ఇంధన సామర్ధ్య లక్ష్యాలను త్వరితగతిన చేరుకోవడంలో భాగంగా స్వతంత్ర ఏజెన్సీలను ఏర్పాటు చేసిన ఏపీ, కేరళ తరహాలోనే అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు. కరోనా సంక్షోభ సమయంలోనూ ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను శ్రీఘ్రగతిన అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఇంధన శాఖను బీఈఈ కొనియాడింది.

ఇందుకుగానూ ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లిని బీఈఈ డీజీ ప్రత్యేకంగా అభినందించారు. ఈకార్యక్రమాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ఇంధన శాఖ ఎప్పటి కప్పుడు ఎనర్జీ ఎఫియన్సీకి సంబంధించి ఆర్ధికపరంగా ఉత్తమ ప్రతిపాదలను బీఈఈకి చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే మీడియా ద్వారా ఇంధన సామర్థ్య కార్యక్రమాలు మరియు ప్రజల భాగస్వామ్య కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును కూడా బీఈఈ విశ్లేషించిందని చెప్పారు.

అవసరమైతే ఈసీ చట్టంలో మార్పులు..
ఎనర్జీ కన్జర్వేషన్‌ (ఈసీ) చట్టం 2001 ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఇంధన రంగ తీవ్రతను తగ్గించే ప్రాథమిక లక్ష్యంతో పనిచేయాలని సూచిం చారు. అవసరమైతే ఈసీ చట్టంలో స్వీయ నియంత్రణ మరియు మార్కెట్‌ సూత్రా లపై విధానాలు మరియు వ్యూహాలను అభివృద్ధి చేయడంలో బీఈఈ అన్ని రాష్ట్రా లకు సహాయం చేస్తుందన్నారు. పర్యావర ణాన్ని పరిక్షించడం, ఇంధన సామర్ధ్య ఫైనాన్సింగ్‌ మరియు జాతీయ ఆర్ధిక వ్యవస్థ పెంపొందించడంపై పర్యావరణ పరిరక్షణ ప్రభావం అనే అంశాలపై బీఈఈ సీనియర్‌ డైరెక్టర్లు సౌరభ్‌ దిద్ది, మిలింద్‌ డియోదర్‌, సునీల్‌ ఖండారే, అరిజిత్సేన్‌ గుప్తా, వినీతా కన్వాల్‌ సవివరంగా తెలియజేశారు. అలాగే ఎంఎస్‌ఎంఈలు, ఈసీబీసీ, పాట్‌, వంటి కార్యక్రమాలపై అవగాహన
కల్పిం చారు.

టాప్ 10లో ఏపీ ..
అలయన్స్‌ ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌ ఎకా నమీ (ఏఈఈఈ) రూపొందించిన స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్‌ (ఎస్‌ఈఈఐ)- 2020ని బీఈఈ విడు దల చేసింది ఇందులో ఉత్తమ ఫలితాలు సాధించిన మొదటి 10 రాష్ట్రాలను గుర్తించారు. వీటిలో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, హ ర్యానా పంజాబ్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, తమి ళనాడు వంటి రాష్ట్రాల్లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలు గురించి వివరించింది.

- Advertisement -

2070 నాటికి పర్యావరణ హితంగా..
బీఈఈ ఎంచుకున్న ఈ లక్ష్యాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2070 నాటికి కాలుష్య రహి తంగా చేయడం ద్వారా భావితరాలకు ప్రయోజనాలను కాపాడేందుకు వాతావరణంలో ఏర్పడే దుష్ప్రభావాలను తగ్గించే విధంగా అడుగులు వేస్తోంది. శూన్య ఉద్యగారాలను చేరుకునే లక్ష్యంలో భాగంగా దాదాపు 50 శాతం ఉపయోపడే ఇంధన సంరక్షణ మరియు ఇంధన సామర్ధ్య కార్యక్రమాల్లో ప్రైవేటు- మరియు ప్రభుత్వ రంగాల్లోని వినియోగదారులను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకమైన యంత్రాంగాన్ని రూపొందిస్తోంది.

రూ.40,945 కోట్ల మేర ఆదా ..
ఇప్పటికే గత కొన్నేళ్లుగా బీఈఈ చేసిన ప్రయత్నాల ఫలితంగా రూ. 40,945 కోట్ల మేర భారీ ఇంధన పొదుపును సాధించింది. ఈనేపథ్యంలోనే రానున్న దశాబ్దకాలంలో 129 మిలియన్‌ టన్స్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఈక్వలెంట్‌ (ఎంటీ-ఓఈ) సాధించాలన్న భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అలాగే 2070 నాటికి కాలుష్య రహిత (శూన్య ఉద్గారాల) భారత దేశాన్ని ఏర్పాటు- చేయాలన్న ల క్ష్యంతో ముందుకు సాగుతోంది. ము ఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమ లు, మున్సిపల్‌ మరియు భవన నిర్మా ణాలు మొదలైన కీలక రంగాల్లోని వినియోగదారులను విద్యుత్‌ పరి రక్షణలో భాగంగా చైతన్య పర్చడ మే లక్ష్యంగా చేసుకుని ఆశించిన స్థా యిలో ఇంధన సామర్ధ్య లక్ష్యాలను చేరు కునేలా కార్యక్రమాలను చేపట్టబోతోంది.

129 ఎంటీఓఈలు ఈ విధంగా..
2031 నాటికి దేశంలోని వివిధ రంగాల్లో 129 ఎంటీ-ఓఈ విద్యుత్ను ఆదాచేసే దానిలో భాగంగా వ్యవసాయ రంగంలో 9.9 ఎంటీ-ఓఈ అంటే 15 శాతం మేర విద్యుత్‌ ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టు-కుంది. అలాగే వాణిజ్య రంగంలో 6.4 ఎంటీ-ఓఈ (22శాతం), గృహావసరాలకు 15.1 ఎంటీ-ఓఈ (15 శాతం), మునిసిపాలిటీ-ల పరిధిలో 1.5 ఎంటీ-ఓఈ (19 శాతం), పారిశ్రామిక రంగంలో 72.3 ఎంటీ-ఓఈ (16 శాతం), రవాణా రంగంలో 23.8 ఎంటీ-ఓఈ (10 శాతం) మేర ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు- అభయ్‌ భాక్రే తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement