Saturday, May 4, 2024

Big story | ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణం.. మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్‌డీఏ కసరత్తు

అమరావతి, ఆంధ్రప్రభ : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అమరావతి ఆర్‌-5 జోన్‌ పరిధిలో గృహనిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. వర్షాల కారణంగా లేఅవుట్లలో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ప్లాట్ల మంజూరు చేసేనాటికే మెరక, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టారు. విద్యుద్దీపాల నిమిత్తం స్తంభాలను రవాణా చేస్తున్నారు. ఈ జోన్‌లో గృహ నిర్మాణానికి ఈనెల 24వ తేదీన సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి లాంఛనంగా భూమిపూజ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ పర్యవేక్షిస్తున్నారు.

గత కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలలోని 53,216 మంది పేదలకు ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయటంతో పాటు స్థిర నివాసాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. గృహ నిర్మాణంతో పాటు విద్య, ఆరోగ్య ప్రమాణాలను అత్యుత్తమ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సం(ఏపీ సీఆర్డీఏ) కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ నేతృత్వంలో రూ.72.06 కోట్లతో సోషల్‌ ఇన్ఫా ప్రాజెక్టులకు 25 లేఅవుట్ల చెంత నైబర్హుడ్‌ స్కూల్స్‌, ఈ హెల్త్‌ సెంటర్లు, అంగన్‌ వాడీ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -

అమరావతిలో పేద ప్రజలకు ప్రభుత్వం నిర్మిస్తున్న పక్కా గృహాలతో పాటు టిడ్కో గృహాలలో కలిపి 2.36 లక్షల మంది జనాభా నివసిస్తారు. వారి జీవన ప్రమాణాలు అతున్నతంగా ఉండేలా అమరావతి స్మార్ట్‌ అండ్‌ స్టసనబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌ఎస్సీసీఎల్‌) ఈ సోషల్‌ ఇన్ఫా ప్రాజెక్టులను చేపట్టనుంది. 25 లే అవుట్లలో ఏఎస్‌ఎస్సీసీఎల్‌ 45 ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలు ఇలా ఉన్నాయి. నైబర్‌ హుడ్‌ స్కూల్స్‌ రూ. 25 కోట్ల అంచనా వ్యయంతో 11 ఏర్పాటు కానున్నాయి. మందడం, పిచ్చుకలపాలెం, ఐనవోలు, అనంతవరం, నెక్కల్లు, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రులో మూడు పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. 12 ఈ-హెల్త్‌ సెంటర్లను రూ.20 కోట్లతో చేపట్టనున్నారు.

మంరదడం, పిచ్చుకలపాలెం, ఐనవోలు, అనంతవరం, నెక్కల్లు, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రులో నాలుగు సెంటర్లు ఏర్పాటవుతాయి. కాగా మరో 11 అంగన్‌వాడీ సెంటర్లను రూ.17.60 కోట్లతో మంరదడం, పిచ్చుకలపాలెం, ఐనవోలు, అనంతవరం, నెక్కల్లు, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రులో మూడు సెంటర్లు నెలకొల్పాలనే యోచనతో ప్రభుత్వం ఉంది. రూ. 9.46 కోట్లతో 11 డిజిటల్‌ లైబ్రరీలు మంరదడం, పిచ్చుకలపాలెం, ఐనవోలు, అనంతవరం, నెక్కల్లు, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రులో మూడింటికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.

లే అవుట్లలో అయిదు వేల మొక్కలతో పచ్చదనం

అమరావతిలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఆర్‌-5 జోన్‌లో వేసిన 25 లే అవుట్లలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సం(ఏపీ సీఆర్డీఏ) ల్యాండ్‌ స్కేప్‌ ఎన్విరాన్మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో అయిదు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాంతంలో రెండు లక్షల పైగా జనాభా నివశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేపడుతుంది. ప్రజలకు చక్కటి ఆక్సిజన్‌ అందించేందుకు, సుస్థిర నివాసానికి నీడ నిచ్చే మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. లే అవుట్లలో పచ్చదనం అభివృద్ధి కోసం కేటాయించిన 10 శాతం భూమి 146 ఎకరాలలో 28 వేల రావి, వేప, నేరేడు, బాదం, రెయిన్ట్రీ, పచ్చతురాయి, పొగడ, ఆకాశమల్లె వంటి నీడనిచ్చే చెట్లతో ఈ ప్రాంతం కనువిందు చేయనుంది. అర్బన్‌ ఫారెస్ట్‌ కార్యక్రమంలో భాగంగా నగరాలలో హరిత వనాలు నెలకొల్పాలనే ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. మొక్కల ఏర్పాటు-కు ఏపీ సీఆర్డీఏ 1.68 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 24వ తేదీ జరిగే కార్యక్రమానికి 26 ఎకరాలలో అయిదు వేల మొక్కలు నాటనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement