Monday, April 29, 2024

Big Breking: బ‌ద్వేలులో ఫ్యాను సుడిగాలి.. సుధా విజయం ఖరారు

బద్వేలులో ఊహించిందే జరిగింది. సంచలనాలను ఆశించిన విపక్షాలకు నిరాశే ఎదురైంది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఫ్యాన్ గాలి సుడిగాలిలా వీచింది. వైసీపీ అభ్యర్ధి డాక్టర్‌ సుధా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. బద్వేల్‌లో వైసీపీ అభ్యర్థి సుధ 90,089 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. వైసీపీకి మొత్తం 1 లక్షా 11 వేల 710 ఓట్లు రాగా, బీజేపీకి 21 వేట 612 ఓట్లు లభించాయి.

బద్వేల్‌లో మొత్తం 1 లక్షా 46 వేల 546 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీకి 1 లక్షా 11 వేల 710 ఓట్లు లభించాయి. బిజెపికి 21 వేల 621 ఓట్లు కాంగ్రెస్ కు 6 వేల 205 ఓట్లు వచ్చాయి. నోటాకు 3 వేల 635 ఓట్లు వచ్చాయి. దీంతో 90 వేల 089 ఓట్ల తేడాతో వైసీపీ విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement