Friday, April 26, 2024

ఖాతాదారులకు గమనిక: ఏపీలో మారిన బ్యాంకుల పనివేళలు

ఏపీలో కర్ఫ్యూ సమయాన్ని ప్రభుత్వం సడలించడంతో బ్యాంకుల పనివేళలు మారాయి. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. నిన్నటి‌ వరకు ఉదయం 9 నుండి 12‌ వరకు బ్యాంకులు పనిచేశాయి. కర్ఫ్యూ ఆంక్షల సడలింపుతో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనాను కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కర్ఫ్యూను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి వెసులుబాటు కల్పించింది. దీనితో ఈరోజు నుంచి బ్యాంకులు పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు జూన్ 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తాయని ఎస్ఎల్బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఖాతాదారులు అవసరమైతే బ్యాంకు రావాలని ఆయన సూచించారు. సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకు సిబ్బంది విధుల్లో ఉంటారని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బ్యాంకు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విధులు జరుగుతాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement