Monday, May 6, 2024

టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

కర్నూలు జిల్లా బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని బనగానపల్లె పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేసిన ఘటనలో జనార్దన్ రెడ్డితో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు భారీ ఎత్తున మోహరించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. టీడీపీ కార్యకర్తల్లో భయాందోళనలు, సృష్టించేందుకే పోలీసుల అత్యుత్సాహం చేస్తున్నారని జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. అర్ధరాత్రి జనార్దన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ పోలీసుల వాహనాలను ఆయన అనుచరులు అడ్డుకున్నారు. అయితే, చివరికి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసి డోను పీఎస్ కు తరలించారు. జనార్దన్ రెడ్డిపై ఐపీసీ 307, 147, 148, 324, 341, 3 క్లాస్ 1, సెక్షన్ లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement