Saturday, May 18, 2024

Flash: చెవులు లేకుండా జన్మించిన శిశువు..  ఎక్కడంటే..

రెండు చెవులూ లేకుండా ఓ మగబిడ్డ జన్మించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పెదబయలు మండలం వనబంగి గ్రామానికి చెందిన మోహన్‌రావు, నాగమణి భార్యాభర్తలు. ఈ నెల 18వ తేదీన నాగమణి పాడేరు జిల్లా ఆసుపత్రి ప్రసూతి విభాగంలో చేరారు. అదే రోజు సాయంత్రం ఆమె ప్రసవించారు. చెవులు లేకుండా జన్మించిన శిశువును చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. శిశువు ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన పరీక్షలు, చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శంకరప్రసాద్‌ మాట్లాడుతూ ఇలాంటి జననాలు చాలా అరుదుగా జరుగుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement