Thursday, May 2, 2024

బాబు జగ్జీవన్ రామ్ ఆశయసాధనకు కృషి చేయాలి.. మంత్రి రోజా

తిరుపతి సిటీ, ఏప్రిల్ 5 (ప్రభ న్యూస్) : బాబు జగ్జీవన్ రావ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పర్యటక క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం స్థానిక బైరాగి పట్టెడలోని బాబు జగ్జీవన్ రామ్ పార్కులో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ… సంఘ సంస్కర్తగా పరిపాలన దక్షుడిగా అఖండ భారతానికి విశేష సేవ‌లు అందించిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని గుర్తు చేశారు. బాబు జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement