Sunday, April 28, 2024

AP: అవనిగడ్డలో కదంతొక్కిన డీఎస్సీ అభ్యర్థులు..

(అవనిగడ్డ- ప్రభన్యూస్) : కృష్ణాజిల్లా అవనిగడ్డలో నిరుద్యోగుల డీఎస్సీ అభ్యర్థులు కదం తొక్కారు. వేలాదిగా ఒక్కసారిగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా.. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చి, నేటికీ నాలుగున్నర సంవత్సరాలు దాటుతున్నప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ విధంగా నిరుద్యోగులు గుణపాఠం చెప్పారో, 2024 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అదే రీతిలో గుణపాఠం గట్టిగా చెబుతామని, ఉపాధ్యాయులను అత్యంత హీనంగా చూస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమ‌ని, ఉపాధ్యాయులు ఉంటేనే బావి భవిష్యత్ తరాలకు బాసట కల్పిస్తారని, కానీ అటువంటి ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులును మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెబుతామని నిరుద్యోగులు తెలిపారు.

- Advertisement -

నిరుద్యోగులకు మద్దతుగా మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, ఉత్తరాంధ్ర పట్టభద్ర శాసనమండలి సభ్యులు చిరంజీవ రావు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కొండవీటి సునీత, అవనిగడ్డ, కోడూరు టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, బండే శ్రీనివాసరావు, మాచవరపు ఆదినారాయణ, కృష్ణా జిల్లా మాల మహానాడు దోవ గోవర్ధన్, ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, లుక్క పిచ్చియ్యతో పాటు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొనగా, వీరితో పాటు జనసేన, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement