Sunday, April 28, 2024

ఎపిఎస్ ఆర్టీసీకి ప్ర‌యాణీకుల క‌ళ – ఒక్క‌రోజే రూ .19 కోట్ల ఆదాయం..

అమరావతి,ఆంధ్రప్రభ: గత నెలలో విద్యార్థుల కు వరుస పరీక్షలుండట, సుముహార్తాలు లేక పెళ్లిళ్లు, శుభకార్యాలు లేకపోవడంతో ఆర్టీసీ ఆదాయం నీర సించింది. ఓఆర్‌(ఆక్యుపెన్సీ రేషియో) భారీగా తగ్గి రోజువారి ఆదాయంలో రూ.3 నుంచి రూ.4 కోట్ల వర కు గండిపడింది. ఇప్పుడు వరుసగా రెండు నెలల పా టు శుభకార్యాలకు పెద్ద ఎత్తున ముహుర్తాలు ఉండ టం, విద్యార్థులకు వేసవి సెలవులు కావడంతో తిరిగి ఆర్టీసీ ఆదాయం పుంజుకోనుంది. గత రెండు నెలల తో పోల్చితే మే ఆరంభంలోనే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కరెంట్‌, ఆన్‌లైన్‌ బుకింగ్‌లు పెరిగి బస్టాండ్లు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ఒక్క సోమవారం రోజే రికార్డు స్థాయిలో రూ.19 కో ట్లు ఆదాయం రావడం పట్ల అధికారులు ఖుషీగా ఉన్నారు. రానున్న రెండు నెలల్లో ఇదే స్థాయిలో ఆదా యం ఉంటుందనే ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సర్వీసుల నిర్వహణ(ఆపరేషన్స్‌) లో సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్ర త్తలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులను అన్ని రూట్లకు సిద్ధం చేయడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, బస్టాండ్లలో పరిశుభ్రత సహా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.

మార్చి, ఏప్రిల్‌లో తగ్గిన ఆక్యుపెన్సీ..
ఆర్టీసీకి గత రెండు నెలలుగా ఆక్యుపెన్సీ రేషి యో తగ్గింది. గతంలో సగటును 69 శాతం వరకు ఉండే ఓఆర్‌ మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో క్రమేపీ తగ్గు తూ 60శాతానికి దిగువకు పడిపోయింది. ఏప్రిల్‌ మా సంలో వివిధ రకాల పరీక్షలు ఉన్నాయి. ఇంటర్‌, పదో తరగతి, ఎంసెట్‌ వంటి పలు పరీక్షలు ఉండటంతో మార్చి నుంచే విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రయాణా లకు దూరంగా ఉన్నారు. పైగా ఆ రెండు నెలల్లో సుముహుర్తాలు కూడా లేవు. ఒక వేళ ఉన్నా బంధువులు, ఇతరులు ఆయా కార్యక్రమాలకు వెళ్లే పరిస్థితులు లేవు. వివిధ కార్యాలకు వెళితే పిల్లల చదువు కుంటుపడుతుందనే అభిప్రాయంతో మెజా రిటీ ప్రయాణికులు వీటికి దూరంగానే ఉన్నారు. ఈ నేపధ్యంలొ రోజువారీ ఆదాయం భారీగా తగ్గింది. సగటును రోజుకు రూ.16.5 కోట్ల నుంచి రూ.17.5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. రెండు నెలల్లో క్రమే పీ ఆదాయం తగ్గుతూ రూ.13 కోట్లకు మించలేదని అధికార వర్గాల సమాచారం.

ముహుర్తాలే ముహుర్తాలు..
రెండు నెలల పాటు పెద్ద ఎత్తున ముహుర్తాలు ఉన్నాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంఖుస్థాప నలు, ఉప నయనాలు(ఒడుగు) వంటివి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆయా శుభ కార్యాల్లో పాల్గొనేం దుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బంధుమి త్రులు తరలివస్తారు. ఇదే సమయంలో ఆయా కార్య క్రమాల్లో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు భాగస్వా ములు కావడంతో వీరు కూడా వివిధ ప్రాంతాలకు తరలివస్తుంటారు. హైదరాబాద్‌ సహా ప్రధాన పట్టణా ల్లో స్థిరపడిన వారంతా వివిధ వేడుకల్లో పాల్గొనేం దుకు గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళుతుంటారు. పైగా వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో ఎక్కువ మంది స్వస్థలాలకు వెళ్లడం రివాజు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఆదాయం పెద్ద ఎత్తున పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు చెపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement