Thursday, April 25, 2024

ఉద్యోగ వేటలో ఏపీ విద్యార్ధులు వెనుకబాటు.. 20 శాతం మందికే ఉద్యోగ నైపుణ్యాలు

అమరావతి,ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఇంజనీరింగ్‌ కాలేజీలు దాదాపు 500కి పైగా ఉన్నాయి. ఏడాదికి లక్షకుపైగా ఇంజనీరింగ్‌ విద్యార్ధులు పట్టాలు పుచ్చుకొని బయటకు వస్తున్నారు. అయితే వీరిలో వెనువెంటనే ఉద్యోగాలు మాత్రం అతి తక్కువ మందికే వస్తున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ చేసిన విద్యార్దుల్లో 20 శాతం మందికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉంటున్నాయని నాస్కామ్‌ ప్రతి ఏడాది పేర్కొంటోంది. ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా ఇంజనీరింగ్‌ విద్యార్ధులు తయారు కావడం లేదు. ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేసిన తర్వాత మరలా కొన్ని స్కిల్స్‌ అభివృద్ది చేసుకుం టే గానీ ఉద్యోగాలు దొరకడం లేదు. ఇంజనీరింగ్‌ చదువులకే ఉన్న కొద్దిపాటి డబ్బు కాస్తా ఖర్చు చేసుకునే పేద విద్యార్ధులకు ఆ తర్వాత ఖర్చు పెట్టి స్కిల్స్‌ నేర్చుకోవడం గగనమైపోతోంది.

దీంతో వీరు చదివిన చదువుతో సంబం ధం లేకుండా ఏ ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగంలో చేరిపోతున్నారు. ముఖ్యంగా రెండు రకాల నైపుణ్యాలు ఇంజనీరింగ్‌ విద్యార్ధులకు అవసరం. ఒకటి డోమైన్‌ స్కిల్స్‌ అంటే తాము చదువుతున్న కోర్సుల్లో నైపుణ్యాన్ని కల్గిఉండడం కాగా రెండోది కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ముఖ్యంగా ఇంగ్లీష్‌ బాగా మాట్లాడగలిగి ఉండటం. ఈ రెండు స్కిల్స్‌ కల్గిఉన్నవారు రాష్ట్రం నుండి వస్తున్న ఇంజనీర్లలో 20 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇంజనీరింగ్‌ విద్యార్ధులతోపాటు మామలు డిగ్రీ చదివే విద్యార్ధుల్లో కూడా స్కిల్స్‌ పెంచేందుకు భారీ కసరత్తునే ప్రారంభించింది.

నైపుణ్యాన్ని పెంచే ఇంటెర్న్‌షిప్‌లు..

- Advertisement -

ఇంజనీరింగ్‌ విద్యార్ధుల తోపాటు డిగ్రీ చదవుతున్న విద్యార్ధులకు కూడా ఉన్నత విద్యా మండలి తప్పనిసరి ఇంటర్నెషిప్‌లను అమల్లోకి తెచ్చింది. ప్రతి ఒక్కరు పది నెలలపాటు ఏదోక పరిశ్రమలో ఇంటర్నెషిప్‌ చేయాల్సి ఉంటుంది. దీని వలన ఆ సంబంధిత పరిశ్రమలో పనిచేయగలిగే నైపుణ్యాలు ఆ విద్యార్ధికి అలవాడతాయి. దీంతోపాటు మైక్రోసాఫ్ట్‌ తో ఉన్నత విద్యా మండలి ఓ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం లక్షా 62 వే మందికి అప్‌ స్కిల్‌ ఇంప్రూమెంట్‌ను మెక్రోసాఫ్ట్‌ అందిస్తుంది. దీంతోపాటు విద్యార్ధులకు అన్‌లైన్‌లో కూడా స్కిల్‌ను పెంపొందించుకునే అవకాశాన్ని కల్గిస్తోంది. ఇది కాకుండా కరిక్యులమ్‌లోనే 30 శాతం నైపుణ్యాలు పెంచుకునేలా తయారు చేశారు. ఈచర్యల న్నింటి ద్వారా విద్యార్ధులు తమ డొమైన్‌ స్కిల్స్‌ను బాగా అభివృద్ది చేసుకునే అవకాశం కలుగుతుంది.

ఇంగ్లీష్‌ ప్రవీణ్యం కోసం ప్రత్యేక చర్యలు..

మరోవైపు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెంపుదలలో భాగంగా ఇంగ్లీష్‌లో ప్రవీణ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాఠశాల స్థాయితో పాటు ఉన్నత విద్యలోనూ తప్పనిసరిగా ఇం గ్లీష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల విద్యార్ధులు తప్పనిసరిగా ఇంగ్లీష్‌లో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతోపాటు ఇంగ్లీష్‌ వర్క్‌బుక్స్‌ను రూపొందించారు. విద్యార్ధులు ఈ వర్క్‌బుక్‌లను చదవడం ద్వారా ఇంగ్లీష్‌ నైపుణ్యం బాగా పెరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్‌లో ఉచితంగా ఉపన్యాసాలు అందుబాటులో ఉంచేందుకు ఉన్నత విద్యా మండలి సైలర్‌ అకాడమీతో ఎంఓయు కుదుర్చుకుంది. ఈ ఉపన్యాసాలను వినడం ద్వారా విద్యార్ధులు ఇంగ్లీష్‌లో మాట్లాడే నైపుణ్యం బాగా పెరుగుతోంది. ఇలా చాలా రకాలుగా విద్యార్ధుల్లో నైపుణ్యాన్ని పెంచే కృషిని ఉన్నత విద్యా మండలి, రాష్ట్ర ్రపభభుత్వం భారీగా చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement