Tuesday, April 30, 2024

ద‌క్షిణాదిన ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీలో ఎపి నెంబ‌ర్ 2

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించనుంది. దక్షిణ భారతదేశంలోని ఇంటర్నెట్‌ కనెక్టివిటీ-లో ఏపీ రెండవ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలోని పాఠశాలలు రానున్న కొద్ది నెలల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు. దక్షిణ భారతదేశంలో కేరళ తర్వాత అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కలిగి ఉన్న రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం విశేషం. యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్ర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యూఢిఐఎస్‌ఇ) ప్రకారం, కేరళలోని 94.57శాతం ప్రభుత్వ పాఠశాలలు ఇంటర్నెట్‌కు అనుసంధానించబడి ఉండగా, ఏపీలో 45 శాతం కనెక్టివిటీ- ఉంది, తమిళనాడులో 24.68, కర్ణాటక 10.68 తెలంగాణల్లో మరియు 9.23 శాతం ఉన్నాయి. భారతదేశంలో పాఠశాల విద్య మరియు సాహిత్య విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో మొత్తం 10.22 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 24.15 శాతం ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి.

కొన్ని రాష్ట్రాల్రు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు 100శాతం ఇంటర్నెట్‌ కనెక్షన్‌లతో ప్రభుత్వ పాఠశాలలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు (మొత్తం 2,762), చండీగఢ్‌ (123) మరియు పుదుచ్చేరి (422) ఇంటర్నెట్‌ కనెక్షన్‌లను కలిగి ఉన్నాయి. విశాఖపట్నంలోని మధురానగర్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి) హైస్కూల్‌ తగినంత వేగంతో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ వుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది పాఠశాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించింది. కాగా ఫైబర్‌ నెట్‌ సాంకేతిక పరికరాల మద్దతుతో విద్యార్థులకు బోధిస్తామని ఉపాధ్యాయులు చెప్పారు. హైస్కూల్‌ విద్యార్థులకు ఒక్కొక్కటి రూ.15,000 విలువైన ట్యాబ్‌లు మరియు ఎడ్యుకేషన్‌ మెటీ-రియల్‌ కూడా అందించబడ్డాయి. సచివాలయం నెట్‌వర్క్‌ మద్దతుతో, ఇతర వినియోగదారులకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్‌ కవరేజీని వేగవంతం చేయగలుగుతున్నాయి. రాబోయే కొద్ది నెలల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలను కవర్‌ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ల్యాప్‌టాప్‌లు పొందిన కళాశాల విద్యార్థులకు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని అందించడానికి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు- ఎపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ పూనూరు గౌతమ్‌ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌తో ఏంఓయూ కుదుర్చుకొని, కంప్యూటింగ్‌ పరికరాలు కలిగి ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఫైబర్‌ నెట్‌ సౌకర్యం కల్పించనున్నట్లు- పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement