Wednesday, May 15, 2024

ఎన్‌ఎస్‌ఐసీతో ఏపీ ఎంఎస్‌ఎంఈ ఒప్పందం..

అమరావతి, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్‌ఎస్‌ఐసీతో ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులకు అవసరమైన ముడి సరుకుల లభ్యత అందుబాటులోకి తీసుకురావడం, మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించడం కోసం ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ ఎన్‌ఎస్‌ఐసితో ఈ రోజు (గురువారం) ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే ఐదు సంవత్సరాలు ఎన్‌ఎస్‌ఐసీ, ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు తన సహకారం అందిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమస్యల్ని పరిష్కరించి వాటి సామర్ధ్యాన్ని మెరుగుపర్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు తోడ్పడుతోందని పరిశ్రమలు, వాణిజ్యం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ చెప్పారు.

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధుల్ని కేటాయించిందన్నారు. 26 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు రెండు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల చొప్పున 52 క్లస్టర్లు తొలి విడత గుర్తించి అభివృద్ధి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డ సి డ్‌ బి ప్రాజెక్ట్‌ మోనటరింగ్‌ యూనిట్‌గా ఉన్న గ్రాంట్‌ తోర్న్‌ టన్‌ సంస్థ ఎంఓయు కుదుర్చుకోవడంలో సహకరించినట్లు ఎంఎస్‌ఎంఈ ఛైర్మన్‌ వి. రవీంద్రనాథ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ఎండీ సృజన, ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈడీ బి.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement