Sunday, April 28, 2024

టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులపై హైకోర్టు విచారణ

టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులపై హైటీటీడీ పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితునిగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాత్రమే పాలకమండలి భేటీకి హాజరుకావచ్చని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చామని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రత్యేక ఆహ్వానితుల పాత జోవో చెల్లదంటూ న్యాయవాది అశ్వినీ కుమార్ వాదనలు వినిపించారు. టీటీడీ నియామకాలపై బీజేపీ నేత భానుప్రకాష్‍రెడ్డి పిటిషన్‍పై లాయర్ వాదనలు కొనసాగించారు. పాలకమండలిలో 18 మంది సభ్యుల నేరచరిత్రపై దాఖలు చేసిన పిటిషన్‍పై కూడా అశ్వినీ కుమార్ వాదనలు వినిపించారు. నేటికీ 16 మంది కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. మార్చి 11వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయకపోతే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement