Friday, May 3, 2024

ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఒక్కో అకౌంట్లో రూ.20 వేలు జమ

ఏపీలో అగ్రి గోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. మంగళవారం(ఆగస్ట్ 24) 20 వేల రూపాయల లోపు ఉన్న అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులకు వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. ఈ నెల 19 వరకూ 7.76 లక్షల మంది డిపాజిట్‌దారులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి ఇప్పటికే రూ.240 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. 67 ఎకరాల అగ్రిగోల్డ్ స్థలాన్ని కోర్టుకు స్వాధీనం చేశామన్నారు. అగ్రి గోల్డ్ బాధితుల కష్డాలని నేరుగా చూసిన వ్యక్తిగా సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వం తరపున న్యాయం చేశారన్నారు. పాదయాత్ర సందర్భంగా అగ్రి గోల్డ్‌ బాధితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి బాధితుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ ఆదుకుంటున్నారని చెప్పారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 20 వేల రూపాయిల లోపు డిపాజిట్లు కట్టిన బాధితులకి న్యాయం చేయాలని వైఎస్ జగన్ చంద్రబాబుని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అగ్రి గోల్డ్ యాజమాన్యంతో టీడీపీ ప్రభుత్వం కుమ్మక్కై బాధితులకి ‌అన్యాయం చేశారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా ప్రైవేట్ సంస్ధ మూసేస్తే బాధితులకి ప్రభుత్వం న్యాయం చేసిన దాఖలాలు లేవన్నారు. డిపాజిట్‌దారులకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 2015లో అగ్రిగోల్డ్‌ యాజమాన్యం బోర్డు తిప్పేస్తే.. ఆ యాజమాన్యంతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

ఈ వార్త కూడా చదవండిః బండి సంజయ్‌ పాదయాత్ర మరోసారి వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement