Monday, April 29, 2024

డిమాండ్లు నెర‌వేర్చ‌కుంటే ఆందోళ‌న బాటే – జ‌గ‌న్ కు ఉద్యోగుల అల్టీమేటం…..

అమరావతి, ఆంధ్రప్రభ: విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ జోష్‌లో ఉన్న ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు కొత్త సమస్యను తీసుకొచ్చాయి. తమ డిమాండ్లు తీర్చాల్సిందేనంటూ అల్టిమేటం ఇచ్చాయి. లేదంటే ఈనెల 9వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకూ ఉద్యమ కార్యాచరణకు దిగుతామని ప్రక టించాయి. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 5వ తేదీన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామంటూ అల్టిమేటం జారీచేశాయి. దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది. నేడు ప్రభుత్వ ప్రధానకార్యదర్శితో ఉద్యోగ సంఘాల సమా వేశం ఉండబోతోందని తెలుస్తోంది.
కాగా ఇప్పటికే ఒకసారి మంత్రి బొత్స సత్య నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి వారి సమస్యలపట్ల సానుకూలంగా ప్రభుత్వం ఎలా వ్యవహరించ బోతోం దన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టి సారించి వాటిని గెలిచితీరాలన్న ధ్యేయంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు దిగడం పట్ల ప్రభుత్వ పెద్దలు కూడా వారిపై కొంత అసంతృప్తితోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలు గతంలో ఏవైతే డిమాండ్లతో ఉద్యమానికి దిగుతామని ప్రభు త్వానికి చెప్పాయో ఇప్పుడు కూడా అవే డిమాండ్లతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగిందని, దీనిపై గతంలోనే ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ విధానం ఏంటో స్పష్టంగా చెప్పామని ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు చెబుతున్నారు. ఆర్ధిక పరమైన అంశాలైనందున వెంటనే కార్యాచరణకు నోచుకోవడం కష్టమన్నట్లుగా ప్రభుత్వ వాదన కనిపిస్తోంది. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారి సమస్యల పట్ల తాము సానుకూలంగానే ఉంటామని ఇప్పటికే సీఎం జగన్‌ ఉద్యోగ సంఘ నేతలతో పీఆర్సీ విషయంలో జరిగిన సమావేశంలో చెప్పిన సంగతిని కూడా ఇప్పుడు పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.


సీఎస్‌తో చర్చలకు అవకాశం…
ఈనేపద్యంలో నేడు సీఎస్‌ డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో సమావేశం జరగనున్నట్లు- సమాచారం. ఈ సమావేశం లోనే అన్ని పెండింగ్‌ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా పదేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగుల రెగ్యులర్‌ అంశం, 13 వేల మందిని రెగ్యులర్‌ చేస్తామని ఇచ్చిన హామీ, పెండింగ్‌ డీఏల చెల్లింపు, సీపీఎస్‌పై ప్రభుత్వ నిర్ణయం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు తదితర అంశాలున్నాయి. ఇవికాకుండా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల అంశానికి సంబంధించి ఎన్నికల కోడ్‌ ముగిశాక ఒక డీఏ ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ- హామీ ఇచ్చింది. సీపీఎస్‌పై కూడా త్వరలోనే నిర్ణయం ఉంటు-ందని వెల్లడించింది. సీపీఎస్‌ ఉద్యోగులపై నమోదు చేసిన 1,600 కేసులను కూడా మాఫీ చేసేందుకు కమిటీ- అంగీకారం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల బదిలీలపైనా అంగీకారం తెలియజేసింది. వారికి సర్వీస్‌ రూల్స్‌, జాబ్‌ ఛార్ట్‌ సిద్ధం చేస్తామని హామీఇచ్చింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం భూ కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీటన్నింటినీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్న క్రమంలోనే ప్రభుత్వం సీఎస్‌ నేతృత్వంలో ఉద్యోగ సంఘాలతో మంగళవారం భేటీ ఏర్పాటుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
9 నుండి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
తమసమస్యలను పరిష్క రించాలని, సీపీఎస్‌ను అమలు చేయాలంటూ ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు- ఏపీజేఏసీ అమ రావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంక టేశ్వర్లు ప్రకటిం ్‌చారు. ఈమేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను నాలుగేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శిం చారు.
అందుకు నిరసనగా ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళ నలు, నిరసనలు, ధర్నాలు చేస్తామని ప్రకటించారు. ఈనెల 9 నుంచి ఏప్రిల్‌ 3 వరకు దశల వారీగా ఉద్యమం చేస్తామన్నారు. అప్పటికీ స్పందిం చకపోతే ఏప్రిల్‌ 5న జరిగే కార్యవర్గ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. తమ ఉద్యమానికి ఏపీ సీపీఎస్‌ఏ కూడా మద్దతు ప్రకటించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement