Tuesday, May 14, 2024

Breaking: ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫకేషన్.. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఇవే..

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ఈరోజు తుది నోటిఫికేషన్ ను జారీ చేసింది. రేపటి నుంచే కొత్త జిల్లాలు పరిపాలనపరంగా ఉనికిలోకి వస్తాయని పేర్కొన్నది. భౌగోళికంగా మార్పులు చేసిన అన్ని జిల్లాలకు ఏప్రిల్ 4 అపాయింటెడ్ డేగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసింది. ప్రతి జిల్లాకు చెందిన నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లా కేంద్రాన్ని పేర్కొంటూ వేర్వేరు నోటిఫికేషన్లను ఇచ్చింది. కాగా, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. 

పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసి జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ప్రస్తుత 13 నుండి 26 జిల్లాలను విభజించడానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సూచనలు, అభ్యంతరాలను స్వీకరించింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులతోపాటు వివిధ వర్గాల నుంచి 11 వేలకు పైగా అభ్యంతరాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. వాటిలో కొన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం నిన్న(ఏప్రిల్ 3) రాత్రి తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు వివరాలు..

1. శ్రీకాకుళం జిల్లా

జిల్లా కేంద్రం: శ్రీకాకుళం

- Advertisement -

రెవెన్యూ డివిజన్లు: టెక్కలి, శ్రీకాకుళం, పలాస

2. విజయనగరం జిల్లా

జిల్లా కేంద్రం: విజయనగరం

రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి, విజయనగరం, చీపురుపల్లి

3. మన్యం జిల్లా

జిల్లా కేంద్రం: పార్వతీపురం

రెవెన్యూ డివిజన్లు: పాలకొండ, పార్వతీపురం

4. అల్లూరి సీతారామరాజు జిల్లా

జిల్లా కేంద్రం: పాడేరు

రెవెన్యూ డివిజన్లు: పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం జిల్లా

జిల్లా కేంద్రం: విశాఖపట్నం

రెవెన్యూ డివిజన్లు: భీమునిపట్నం, విశాఖపట్నం

6. అనకాపల్లి జిల్లా

జిల్లా కేంద్రం: అనకాపల్లిని

రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం, అనకాపల్లి

7. కాకినాడ జిల్లా

జిల్లా కేంద్రం: కాకినాడ

రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ జిల్లా

జిల్లా కేంద్రం: అమలాపురంని

రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట

9. తూర్పుగోదావరి జిల్లా

జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం

రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమ గోదావరి జిల్లా

జిల్లా కేంద్రం: భీమవరం

రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, కొత్తగా భీమవరం

11. ఏలూరు జిల్లా

జిల్లా కేంద్రం: ఏలూరు

రెవెన్యూ డివిజన్లు: ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు

12. కృష్ణా జిల్లా

కేంద్రం: మచిలీపట్నం

రెవెన్యూ డివిజన్లు: గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు

13. ఎన్టీఆర్‌ జిల్లా

జిల్లా కేంద్రం: విజయవాడ

రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, నందిగామ, తిరువూరు

14. గుంటూరు జిల్లా

జిల్లా కేంద్రం: గుంటూరు

రెవెన్యూ డివిజన్లు: గుంటూరు, తెనాలి

15. బాపట్ల జిల్లా

జిల్లా కేంద్రం: బాపట్ల

రెవెన్యూ డివిజన్లు : బాపట్ల, చీరాల

16. పల్నాడు జిల్లా

జిల్లా కేంద్రం: నరసరావుపేట

రెవెన్యూ డివిజన్లు: గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి

17. ప్రకాశం జిల్లా

జిల్లా కేంద్రం: ఒంగోలు

రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, ఒంగోలు, కనిగిరి

18. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

జిల్లా కేంద్రం: నెల్లూరు

రెవెన్యూ డివిజన్లు: నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు

19. కర్నూలు జిల్లా

జిల్లా కేంద్రం: కర్నూలు

రెవెన్యూ డివిజన్లు : కర్నూలు, ఆదోని, పత్తికొండ

20. నంద్యాల జిల్లా

జిల్లా కేంద్రం: నంద్యాల

రెవెన్యూ డివిజన్లు: నంద్యాల, డోన్‌, ఆత్మకూరు

21. అనంతపురం జిల్లా

జిల్లా కేంద్రం: అనంతపురం

రెవెన్యూ డివిజన్లు: కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్‌

22. శ్రీసత్యసాయి జిల్లా

జిల్లా కేంద్రం: పుట్టపర్తి

రెవెన్యూ డివిజన్లు: ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి

23. వైఎస్సార్‌ కడప జిల్లా

జిల్లా కేంద్రం: కడప

రెవెన్యూ డివిజన్లు: కడప, జమ్మలమడుగు, బద్వేలు

24. అన్నమయ్య జిల్లా

జిల్లా కేంద్రం: రాయచోటి

రెవెన్యూ డివిజన్లు: రాజంపేట, రాయచోటి, మదనపల్లి

25. చిత్తూరు జిల్లా

జిల్లా కేంద్రం: చిత్తూరు

రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు, కొత్తగా పలమనేరు, కుప్పం, నగరి

26. తిరుపతి జిల్లా

జిల్లా కేంద్రం: తిరుపతి

రెవెన్యూ డివిజన్లు: సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement