Tuesday, December 3, 2024

AP – విశాఖ జిల్లాను వీడను – ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రతి ఎన్నికల్లోనూ తాను పోటీ చేసే సీటు మారుతోందని విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గం సీటుపై స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తీవ్ర ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందన్నారు. విశాఖ నార్త్‌ నుంచి పోటీ చేయడం లేదన్నారు. నార్త్‌ లో వేరే ఇన్ ఛార్జ్ ని పెట్టమని చెప్పామ‌న్నారు. తనను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పిందన్నారు.

కానీ, చీపురుపల్లిపై తాను నిర్ణయం తీసుకోలేదన్నారు. తానైతే విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని భావిస్తున్నట్టు గంటా చెప్పారు. తనను ఈ జిల్లా నుంచి పంపేద్దాం అనుకుంటున్నారా? పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను.. ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేద‌న్నారు. కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింద‌ని, తాను ప్రతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుతున్నా, కానీ విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తున్నా.. ఇప్పుడు కూడా విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement