Tuesday, April 16, 2024

AP – బాబు ష్యూరిటీ ఉత్తి బూటకం – మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

నంద్యాల ఆంధ్రప్రభ : బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ ఉత్తి బూటకమని, సీటు జారుతోంది..మీ సీటు కాపాడుకోండి, నా గెలుపోటములు ప్రజల ఇచ్ఛ.. దైవేశ్చ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన ప్రభుత్వంలో బేతంచర్లలో 3వేల కుటుంబాలకు రూ.470 కోట్ల లబ్ధి చేకూర్చామని, కుల మతాలు చూడకుండా పారదర్శకంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఓసీల వర్గాలన్నింటికీ మేలు చేశామని బేతంచెర్ల ప్రజలకు మంత్రి బుగ్గన వివరించారు. బేతంచెర్లలో ఈ ఐదేళ్ల కాలంలో 1550 మందికి 2300 ఎకరాల సంపూర్ణ భూహక్కు పత్రాలను అందజేశామన్నారు. డీ పట్టా భూమి ఎకరాకు రూ.10 లక్షల చొప్పున వేసుకున్నా 1550 కుటుంబాలకు రూ.230 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం పంచిందని, గత ప్రభుత్వంలో సూర్యాస్తమయం తర్వాత కార్యాలయాల తలుపులు తెరచేవారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పేదల జీవితాల్లో సూర్యోదయం మొదలైందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement