Friday, December 6, 2024

AP – అరకులో ఘోర రోడ్డు ప్ర‌మాదం … అయిదుగురి మృతి..

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అరకులోయ మండలం గన్నెల రహదారిలో మాదల పంచాయతీ నంది వలస గ్రామం వద్దర జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు.. రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. నందివలసలో జరిగిన జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. జాతరకు వెళ్లి వస్తున్న రెండు బైక్‌లను అరకులోయ నుంచి వెళుతున్న బైక్‌ దమ్మగుడి సమీపంలో ఢీకొట్టింది.. నాలుగేళ్ల బాలుడు సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మృతి చెందారు.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి..

మృతులను చినలబుడు ప్రాంతానికి చెందిన బురిడీ హరి, గొల్లూరి అమలాకాంత్, లోతేరుకు చెందిన త్రినాధ్, భార్గవ్ గా గుర్తించారు.. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు.. మృతి చెందిన వారిలో ఇద్దరు 15 ఏళ్ల లోపు యువకులు, ఒకరికి 40 సంవత్సరాల వ్యక్తి కాగా.. అరకులోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాలుగేళ్ల బాలుడు భార్గవ్‌, మరో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు.. మిగిలిన క్షతగాత్రులకు అరకులోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఆస్పత్రి సిబ్బంది.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అరకులోయ పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement