Friday, April 26, 2024

ఏపీ ఎడ్‌సెట్‌ 2022 అడ్మిషన్‌ షెడ్యూల్‌ రిలీజ్

అమరావతి,ఆంధ్రప్రభ: ఏపీ ఎడ్‌సెట్‌ 2022 అడ్మిషన్స్‌ మొదటి దశ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా శాఖా మండలి ప్రకటించింది. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాడు ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఈనెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు వెబ్‌ కౌన్సిలింగ్‌లో రిజిష్ట్రేషన్లు నిర్వహిస్తారు. పిహెచ్‌సి, ఎన్‌సిసి, స్పొర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ లాంటి ప్రత్యేక కేటగిరీల్లో అభ్యర్ధుల దరఖాస్తులను ఈనెల 27వ తేదీన పరిశీలిస్తారు.

వచ్చే నెల 1వ తేదీ నుండి మూడో తేదీ వరకు వెబ్‌ అప్షన్లను నిర్వహిస్తారు. మూడో తేదీన వెబ్‌ అప్షన్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఐదో తేదీన ఫస్ట్‌ ఫేజ్‌ కౌన్సిలింగ్‌లో సీట్ల కేటాయింపు ఉం టుంది. వచ్చే నెల ఏడు నుండి తొమ్మిది తేదీల్లోపు సీట్ల కేటాయించిన కాలేజీలకు వెళ్లి రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల ఏడో తేదీ నుంచి క్లాసులు ప్రారంభమౌతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement