Sunday, May 19, 2024

AP | ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగుల సస్పెండ్, ఆపై కఠిన చర్యలు : ఈసీ

అమరావతి : ఏపీలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని సస్పెండ్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో లంచాలు ఇచ్చే వారిపై, తీసుకునే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఏ ప్రలోభాలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఇటువంటి ప్రలోభాలకు లోనుకావడం చెడు సంకేతం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అరెస్టు చేసి ఎఫైఐఆర్ ఫైల్ చేశామన్నారు. అనంతపురంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగుల జాబితాను పట్టుకుని నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించి, సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

అయితే, పోస్టల్ బ్యాలెట్ కోసం 4.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకూ 3.03 లక్షల (70%) మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎవరన్నా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతే, ఈ 9న ఓటు హక్కును వినియోగించునే అవకాశం కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement