Sunday, April 28, 2024

AP : శ్రీ‌కాళ‌హ‌స్తిలో ప్రారంభ‌మైన మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు…

శ్రీ‌కాళ‌హ‌స్తిలో మ‌హాశివ‌రాత్రి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఇవాళ్టి నుంచి 16వర‌కు బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం 13 రోజుల పాటు నిర్వహిస్తారు.

కాగా, మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పదమూడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో వాహన సేవా కార్యక్రమం ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఇప్పటికే రంగవల్లికలతో సుందరంగా అలంకరించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వాహనసేవలను చూసి ముక్తిని కోరుకుంటారు. అందుకోసం వేల సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement