Monday, May 6, 2024

కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్వస్తేనా..!

కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలకు జిల్లాలో ఇక స్వస్తి పలికే యోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలతో వాటిని అనుసంధానించగలిగితేనే అవి రాష్ట్రం, జిల్లాలో కొనసాగనున్నాయా, లేకుంటే నిలిచిపోతాయాని ప్రజలు, అధికారులు చర్చించుకుంటున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ ప్రభుత్వ ఉన్నత శాఖల అధికారులకు ప్రత్యేక ఉత్తర్వులు జారీతోనే ప్రత్యేక అనుమానాలు వస్తున్నాయి. కేంద్ర పథకాలకు రాష్ట్రం ఇక స్వస్తి పలికే యోచన చేస్తుందని జిల్లాలోని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేకం రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఈ పథకాలలో కేంద్రం కొన్నింటిని 90 శాతం, మరికొన్నింటిలో 70 శాతం ఇతరత్రా 60 శాతం వరకు తన వాటా నిధులను ఇస్తుంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన వాటా నిధులు భరించాలి. ఈ రూపేనా ప్రతి ఆర్తిక సంవత్సరంలో కేంద్రం నుండి దాదాపు వేల కోట్ల వరకు వస్తుండగా, రాష్ట్ర వాటాగా దాదాపు 15 వేల కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుంది. చాలా ఏళ్లుగా కేంద్రం ఇచ్చే ఈ నిధులను ఇతరత్రా పథకాలకు రాష్ట్రం వినియోగించుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రయోజిత పథకాల అమలుపై గట్టి ఆదేశాలు జారీచేసింది. ప్రతి పథకానికి సింగల్‌ నోడల్‌ ఖాతా తెరవాలని నిర్దేశించింది. కేంద్రం నిధులు ఇచ్చిన 21 రోజులలో రాష్ట్ర వాటా నిధులు జమచేస్తేనే కేంద్రం తర్వాత విడత నిధులు ఇస్తుంది. దీంతో రాష్ట్రం తన వాటా సొమ్ము ఇచ్చేందుకు వీలుగా ఎస్‌బిఐ నుండి ఓడి సౌలభ్యాన్ని కోరితే వారు ససేమీరా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఇప్పటికే రాష్ట్రం తన వాటా నిధులు సరిగ్గా జమచేయకపోవడంతో కేంద్రం ఒత్తిడి పెంచింది. దీంతో ప్రస్తుతం జిల్లాలో అమలవుతున్న ఉపాధి హామీ పనులు, మిడ్‌డే మీల్స్‌, రహదారి పనులు, ఇంటింటికీ కొళాయి తదితర పథకాలకు ఆటంకం ఏర్పడనుంది.

133 పథకాలు కేంద్రం అమలు..

రాష్ట్ర, జిల్లాలు కేంద్ర ప్రభుత్వం దాదాపు 130 పథకాలను అమలుచేస్తుంది. రాష్ట్ర పథకాలతో అనుసంధానించగలిగేవి ఐదు, ఆరుకు మించి ఉండబోవని ఆర్థిక శాఖ వర్గం అంచనా వేస్తున్నారు. వాటికే బడ్జెట్‌లో నిధులు చూపించి కేంద్ర నిధుల నుండి ప్రయోజనం పొందనున్నారు. మిగిలిన వాటికి రాష్ట్ర వాటా నిధులు ఇచ్చేందుకు సుముఖంగా లేనందున వాటిని నిలిపివేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చరవాణిలో మాట్లాడుకుంటున్నట్లు జిల్లాలోని ఆ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement