Saturday, May 4, 2024

Kadiri – కరవు మండలాలు పెంచేందుకు ముఖ్యమంత్రి హామీ – ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

శ్రీ సత్యసాయి బ్యూరో నవంబర్ 08: (ప్రభన్యూస్) – రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లాకు మొదటిసారిగా వచ్చిన సందర్భంగా పుట్టపర్తిలో నిర్వహించిన ముఖ్యమంత్రి సభ గ్రాండ్ సక్సెస్ అయిందని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని 53 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరే విధంగా 2204.77 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలోకి జమ చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగేళ్ల కాలంలో రైతుల కోసం 1.75 లక్షల కోట్లు వ్యయం చేసి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటిన ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్ర రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ ఏడాది శ్రీ సత్య సాయి జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు.తక్కిన మండలాలను కూడా కరువు మండలాలు గా ప్రకటించాలని జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి, త్వరలోనే రాష్ట్ర అధికారులతో చర్చించి, ఇతర మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించేందుకు కృషి చేస్తానని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement