Friday, April 26, 2024

తప్పిన ప్రమాదం: కుప్ప కూలిన కలెక్టర్ నివాస భవన పై కప్పు..

అనంతపురం కలెక్టర్‌ కు ఘోర ప్రమాదం తప్పి పోయింది. ఆ జిల్లా కలెక్టర్‌ బంగ్లాలోని ఓ గది పై కప్పు కుప్ప.. ఒక్క సారిగా కూలిపోయింది. అయితే కొన్ని నిమిషాల ముందే ఈ మార్గం గుండా లోపలికి వెళ్ళిన కలెక్టర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అనంతపురం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం తో పాటు కలెక్టర్ నివాసముండే బంగ్లా బ్రిటిష్ కాలంలో నిర్మించినది. ప్రస్తుతం కలెక్టర్ గా ఉన్న నాగలక్ష్మి సెల్వరాజన్ 101వ కలెక్టర్ గా ఉన్నారు. నాగలక్ష్మి సెల్వరాజన్ కొద్ది రోజుల క్రితమే అనంతరపురం జిల్లాకు కలెక్టర్ గా  బాధ్యతలు స్వీకరించారు.

అనంతపురం కలెక్టర్‌ కార్యాలయం లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి భవనం కావడంతో.. ఈ మరమ్మత్తు పనులు చేయిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యం లో కలెక్టర్‌ కార్యాలయం లోని ఓ గది కి చెందిన పై కప్పు ఉన్నట్టుండి కూలిపోయింది. దీంతో కలెక్టర్‌ కార్యాలయంలో ఉన్న సిబ్బంది మొత్తం షాక్‌ కు గురయ్యారు. అయితే.. ఈ ప్రమాదం జరిగిన సమయం లో అక్కడ ఎవరూ లేకపోవడంతో … ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అనంతపురం కలెక్టర్‌… కొత్త చెరువు మండలం పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై కలెక్టర్‌ ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: జైలులోనే మద్యం తాగుతూ స్నాక్స్ తిన్న ఖైదీలు

Advertisement

తాజా వార్తలు

Advertisement