Thursday, April 25, 2024

హుజురాబాద్‌లో దళితబంధుపై ఇంటింటి సర్వే ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధుపై హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇంటింటి సర్వే ప్రారంభమైంది. సర్వే కోసం వచ్చిన అధికారులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. అధికారులను సన్మానించి డప్పు చప్పుళ్లతో ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా వీణవంక ఎస్సీ కాలనీలో జరిగిన సర్వే కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌చార్జి మహేశ్వర్‌ పాల్గొన్నారు. మండలంలోని బేతిగల్‌లో జరిగిన సర్వేలో ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి, డీఆర్డీవో శ్రీలత పాల్గొన్నారు.

అటు మామిడ్లవాడలో సర్వే కోసం వచ్చిన అధికారులకు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ స్వాగతం పలికారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడులో సర్వే అధికారులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. దళితబంధు ఇంటింటి సర్వేపై అధికారులకు ఇప్పటికే పూర్తిస్థాయి శిక్షణ అందించారు. 350 మంది అధికారులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. రోజుకు 100-150 ఇళ్లు సర్వే చేస్తారు. సర్వే అనంతరం గ్రామసభలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

ఈ వార్త కూడా చదవండి: జస్టిస్‌ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement