Friday, June 14, 2024

మ‌ళ్లీ తెగిప‌డిన‌ విద్యుత్ లైన్లు.. రైతుల ఆందోళన..

అనంతపురం బ్యూరో : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాడిమరి మండలంలో విద్యుత్ లైన్ ఆటో పై తెగిపడి ఐదుగురు సజీవదహనమైన సంఘటన మరవకముందే, మండలంలోని పిన్నదరి గ్రామం పూల ఓబయ్య పల్లి నరసింహారెడ్డి పొలంలో రెండు విద్యుత్ లైన్లు తెగిపోయాయి. శనివారం ఉదయం తెగిపోయిన విద్యుత్ లైన్లను రైతులు గుర్తించారు. అందులో సరఫరా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆదివారం రోజు చాలా మంది వ్యవసాయ కూలీలు నరసింహారెడ్డి పొలంలో పని చేశారు. శుక్రవారం ఈ ఘటన జరిగి ఉంటే చాలా ప్రమాదం చోటు చేసుకొని ఉండేదని రైతులు తెలిపారు. హెచ్ వీ డీ ఎస్ ఏర్పాటులో నాసిరకం పనులు చేయడం వల్లనే ఈ రకంగా వైర్లు తెగి పోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని నాణ్యమైన పనులు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement