Thursday, May 16, 2024

Omicron: ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందు.. పంపిణీకి సిద్ధం!

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దేశంలో క్రమంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 213 కేసులు నమోదు అయినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే, ఒమిక్రాన్ ని కట్టడి చేసేందుకు తన వద్ద మందు సిద్ధంగా ఉందని నెల్లూరు జిల్లాలకు చెందిన ఆనందయ్య సంచలన ప్రకటన చేశారు.

కరోనా మందు పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య పేరు వినిపిస్తుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు కోసం బాధితులు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందుతో ఎలాంటి హానీ లేదని నిపుణులు తేల్చడంతో పంపిణి చేశారు. తన ఆయుర్వేద మందుతో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. తాజాగా ఇప్పుడు కరోనా మహమ్మారి ఒమిక్రాన్‌ రూపంలో  భయపెడుతోంది. దీంతో మరోసారి మందు తయారు చేసేందుకు ఆనందయ్య సిద్ధం అయ్యారు.

గతంలో తయారుచేసిన మందుకు మరికొన్ని మూలికలను జోడించి ఈ మందును తయారుచేశామని, ఒమిక్రాన్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని ఆనందయ్య తెలిపారు. పేదలందరికీ తన మందును ఉచితంగా అందిస్తామని చెప్పారు. అయితే, ఎక్కువ మోతాదులో కావాలంటే మాత్రం ప్రత్యేకంగా తయారుచేసిస్తామని తెలిపారు. తన మందు వల్ల ఎలాంటి దుష్ర్పభవాలు కలగవని ఆనందయ్య స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement