Thursday, May 2, 2024

పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌పై చార్జీల మోత.. ఏప్రిల్‌ నుండి అమలులోకి..

కర్నూలు, ప్రభన్యూస్ : పాత వాహనాల రీరిజిస్ట్రేషన్‌ చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచనుంది. 15 ఏళ్లు దాటిన వాహనాలపై చార్జీలను సుమారు 8 రెట్లు వడ్డించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయగా, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు అందాయి. ఆ ఉత్తర్వులను జిల్లాలొ ఏప్రిల్‌ 1 నుండి అమలు చేయనున్నారు. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలపై హరిత పన్నును విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహన రిజిస్ట్రేషన్‌ను ఐదేళ్లకొకసారి రెన్యువల్‌ చేయించుకోవడంతో పాటు 8 ఏళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా సామర్థ్యం ధృవపత్రం తీసుకోవాలి. వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్‌ ఆలస్యమైతే నెలకు రూ.300 చొప్పున, రూ.500 చొప్పున అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

పెరిగిన రుసుములు..

ద్విచక్రవాహనం ప్రస్తుతం రూ.300 ఉండగా, కొత్త ఫీజు రూ.వెయ్యి, కారు రూ.600 ఉండగా కొత్త ఫీజు రూ.5వేలు, ఇంపోర్టెడ్‌ కారు ప్రస్తుతం రూ.15వేలు, కొత్త ఫీజు రూ.40వేలు. రవాణా, వాణిజ్య వాహనాల ధృవ పత్రంకు ట్యాక్సీ ప్రస్తుతం రూ.వెయ్యి ఉండగా, రెన్యువల్‌కు రూ.7వేలు, బస్సులు, లారీలు రూ.1500 ఉండగా, రెన్యువల్‌కు రూ.12,500 పెంచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement