Monday, May 20, 2024

ఎపిలో క్రైం సస్పెన్స్ ఎపిసోడ్స్ …అంద‌రి దృష్టి ఆ అయిదు కేసుల పైనే…

అమరావతి, ఆంధ్రప్రభ: పస్తుతం రాష్ట్రంలో ఐదు కేసులు చర్చనీయాంశంగా మారాయి. వీటిపై రాజకీయ పక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. అత్యంత ఆసక్తికరమైన అంశమేమంటే ఈ ఐదు కేసులు కూడా కోర్టుల పరిధిలో ఉన్నవే. అయినప్పటికీ అటు రాజకీయ పక్షాలు వీటిని రాజకీయం చేయడం, ఇటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడి యాలు వరుస కథనాలు ప్రచురించడం జరిగిపోతున్నాయి. వీటిలో వైయస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఆతరువాత జగన్‌పై కోడి కత్తి దాడి కేసు, మార్గ దర్శిపై సీఐడీ దాడులు, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే (ఆర్‌-5 జోన్‌) అంశం, వైజాగ్‌ రుషికొండపై అక్రమ కట్టడాల నిర్మాణం. ప్రస్తుతం ఈఐదు కేసుల చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ కేసులపై రాజకీయ పక్షాల వాదనలతో ప్రజల్లో గందరగోళ పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. వాస్తవాలేంటన్నదాన్ని వదిలేసి రాజకీయ కోణంలో వీటిని వాడుకుంటూ ఎవరికి వారే లబ్దిపొందే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇక పత్రికల్లో వస్తున్న వివిధ కథనాలు ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేసు ్తన్నాయి. ఒక వర్గం మీడియా వారికి అనుకూలంగా కథనాన్ని ప్రచు రిస్తే.. ఇంకో వర్గం మీడియా వారికి అనుకూలంగా అదే కథ నాన్ని మల్చుకుం టున్నా యి. ఈనేపథ్యంలోనే కోర్టుల పరిధిలో ఉన్న అంశాలపై ప్రసా ్తవించడంగానీ, పత్రికలు, టీవీల్లో ప్రచారం చేయడంగానీ చేయకూ డదన్న అంశాన్ని ఎవరికివారే విస్మరిస్తు న్నట్లు కనిపిస్తోంది. ఈక్రమంలోనే ఈ కేసులపై రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రతి అంశంలోనూ అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా ప్రెస్‌ మీట్లుపెట్టి హడావిడి చేస్తుండటంతో ఆయా పార్టీల నేతలు కూడా వారు చెప్పిన అంశాలను ప్రజల్లోకి తీసు కెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తోంది.

వివేకా హత్య కేసు
వైయస్‌ వివేకానంద రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రికి చిన్నాన్న. ఈయన అనూహ్యంగా 2019 ఎన్నికలకు కొన్ని వారాల ముందు హత్యకు గురయ్యారు. దీనిపై ప్రభుత్వం సిట్‌ వేసి దర్యాప్తు చేసింది. అనూహ్యంగా ఈకేసును సీబీఐకి బదిలీ చేయడంతో అసలు కథ మొదలైంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ వ్యక్తులను టార్గెట్‌ చేస్తూ విచారణ కొనసాగిస్తూ వాస్తవాలను మరుగనపడేలా వ్యవహరిస్తోం దంటూ అధికార వైకాపా మొదటి నుండి వాదిస్తోంది. చట్టప్రకారమే సీబీఐ పనిచేస్తోందని, తప్పు చేయనప్పుడు విచారణకు సహకరిం చడంలో భయమెందుకంటూ తెదేపా ప్రశ్నిస్తోంది. ఇలా ఏళ్లు గడచి పోయాయి. ఈ నేపథ్యంలో ఈకేసును ఈనెలాఖరుకు ఒక కొలిక్కి తీసుకు రావాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ దూ కుడు పెంచింది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కుటుంబానికి చెందిన కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డిని ఆదివారం ఆరెస్టు చేశారు. సోమవారం ఎంపీ అవినాష్‌ రెడ్డిని సీబీఐ ఆఫీస్‌కు విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలోనే ఆయన తన చిన్నాన్న వివేకాపై సంచల ఆరోపణలు చేసారు. ఆయనకున్న అక్రమ సంబంధాలు, ఆర్ధిక లావాదేవీలే ఆయన హత్యకు ప్రధాన కారణమంటూ కొన్ని అంశాలను లేవనెత్తారు. ఈక్రమంలోనే అవినాష్‌ రెడ్డి మందుస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈ కేసు పతాక స్థాయికి చేరుకుంది. దీనిపై ఎవరికి వారే భిన్న కోణంలో చర్చలు చేస్తున్నారు.

జగన్‌పై కోడి కత్తి దాడి కేసు
సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ విమానాశ్రయంలో ఆయనపై కోడి కత్తితో హత్యాయత్నం జరిగింది. ఈకేసుకు సంబంధించి జనవరి 1, 2019 నాడు ఎన్‌ఎస్‌ఐఎ దర్యాప్తు ప్రారంభించింది. సాక్షులను విచారించింది. అయితే ఇటీవల ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదంటూ ఎన్‌ఐఏ కోర్టుకు తెలిపింది. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. విచారణ సమయంలోనూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చాలా విషయాల్ని ఎస్‌ఐఏ దృష్టికి తీసుకెళ్లారని, అయితే.. ఆవిషయాలపై ఎలాంటి విచారణ జరపకుండానే.. జనవరి 23, 2019 ఛార్జీషీట్‌ దాఖలు చేశారని అధికార పక్షం ఆరోపిస్తోంది. నిందితుడు ఎయిర్‌ పోర్టులోకి ఎలా ప్రవేశించాడన్న దానిపైనా దర్యాప్తు జరగలేదని అధికార పక్షం వాదిస్తోంది. సెక్యూరిటీ- ఉండే ప్రాంతంలోకి ఆయుధాన్ని ఎలా తీసుకెళ్లాడన్నదానిపై ఇప్పటి వరకు కోర్టు దగ్గర ఎస్‌ఐఏ ఎలాంటి రిపోర్ట్‌ ఇవ్వలేదంటున్నారు. ఎయిర్‌ పోర్టుులోకి నిందితుడి ఎంట్రీ-పై ఎన్‌ఐఏ విచారణ చేయలేదని వాదిస్తున్నారు. ఎయిర్పోర్టులోకి పాస్‌ లేకుండా నిందితుడు ఎలా వచ్చాడన్న దానిపై కూడా ఎన్‌ఐఏ ఎలాంటి దర్యాప్తు చేయలేదని చెబుతున్నారు. ఇలా.. ఎన్‌ఐఏ పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఛార్జీషీట్‌ దాఖలు చేసిందని ఆరోపిస్తున్నారు. ఈలోపు కుట్రకోణం లేదంటూ కౌంటర్‌ దాఖలు చేడం చూస్తే ఎన్‌ఐఎ సరిగా దర్యాప్తు చేయలేదని అధికార పక్షం వాదిస్తోంది. ఈ కేసులో దాడి చేసినట్లుగా చెబుతున్న శ్రీనివాస్‌ వైసీపీకి చెందిన వాడేనని తాము ముందునుండి చెబుతున్నామని, ఇప్పుడు ఎన్‌ఐఏ విచారణలోనూ అదే వెల్లడైందని ప్రతిపక్ష తెదేపా గొంతెత్తి అరుస్తోంది. జగన్‌పై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని, ఇప్పుడు ఎన్‌ఐఏ విచారణలో కూడా అదే తేటతెల్లమైందని వారు వాదిస్తున్నారు..

ఆర్‌ -5 జోన్‌
రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలుగుదేశం కోర్టును ఆశ్రయించింది. దీంతో వివాదం మొదలైంది. తుళ్లూరు మండలం లోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాల మేర పేదల ఇల్లకోసం జోనిగ్‌ చేశారు. ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై 2022 అక్టోబరులోనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదని, జీవోను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేసింది. గ్రామ సభలు నిర్వహించాలని సూచింది. ఆతరువాత మళ్లిd ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దీంతో అమరావతి రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఈ కేసును హైకోర్టుకు పంపుతున్నట్లు చెప్పడంతో అమరావతి రైతులు తమ పిటీషన్‌ను ఉపసంహరిం చుకున్నారు. దీనిపై తరువాత ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారింది.

- Advertisement -

ఇదే తరహాలో మార్గదర్శి, రుషికొండ అంశాలు
ఇదే తరహాలో మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీపై సీబీఐ దాడులు, రుషికొండపై అక్రమ నిర్మాణాల కేసులు ఉన్నాయి. ఇవి కూడా అధి కార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలను పేల్చుతున్నాయి. ఎవరికివారే తమ వాదనను వినిపిస్తున్నారు. ప్రజలు ఎవరి మాటలు నమ్మాలో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement